గుర్తుకొస్తున్నాయి......
ఎన్నెన్నో అందాలూ..ఏవేవో రాగాలూ...ఆ గోదారి తీరాలు....జ్ఞాపకాల సందళ్ళు.....
Total Pageviews
Wednesday, September 14, 2016
మనిషి ఒంటరిగా బ్రతకలేడు .. అందుకే తనవారు అంటూ తనకి బంధుత్వాలని ,స్నేహితులనీ ఏర్పరచుకుంటాడు . ఇది స్వార్ధం ఏ మాత్రం కాదు .. పురాణ ఇతిహాసాలలో కూడా ఈ బంధాలు లేని దేవుళ్ళు లేరు .. ఐతే ఏర్పరచుకున్న బంధుత్వాలను గాని ,స్నేహాలను గాని నిలబెట్టుకోడానికి ఎన్నో వదులుకోవాలి .ఎంతో త్యాగం చెయ్యాలి. ఇక్కడ నేను అనే స్వార్ధంతో ఏర్పరచుకున్న బంధుత్వం గాని ,స్నేహం గాని శాశ్వతంగా నిలవవు .. కానీ, దురదృష్టం, ఎక్కువ బంధాలు స్వార్ధంతో కూడినవే అవుతాయి . ఈ బంధాల్లో "నేను ఆనందంగా ఉండాలి" అన్న కోరిక ఎదుటి వ్యక్తి మనోభావాలతో పనిలేకుండా ఉండడం వల్ల ఈ స్నేహాలు ,బంధుత్వాలు నిలవక మధ్యలో విచ్ఛిన్నం కావడం చూస్తూనే ఉన్నాము .. నేను స్కూల్ లో రకరకాల మనస్తత్వాలతో కూడిన (ఈ వాక్యం నాకు నచ్చనిది .కానీ ఇక్కడ ఉదాహరించక తప్పడం లేదు .. .. చదివేవారికి అర్ధం ఐ ఉంటుంది .. ఎందుకంటే -అందరూ ఒకేలా ఉంటారు అన్న ఆలోచనా తత్వంతో ఉన్న నాకు ఎవరు, ఎలా ఉన్నా పట్టేది కాదు. ఇది చాలా ముఖ్యమైన కారణం నేను చాలా ప్రశాంతంగా ఉండగలగడం ,ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయగలగడం .. స్కూల్ లో చేరిన తర్వాత నన్ను ఆకర్షించిన వ్యక్తి రమణీ మాడం .. ఆమె చాలా సీనియర్ అని తెల్సింది . అదే సీనియారిటీ భావన తర్వాత తర్వాత ఆమెకి మనసుకి శాంతి లేకుండా చేసింది .. చాలా మందిని ఇబ్బంది పెట్టింది ..కొత్తదనానికి ఆహ్వానం పలికినా ఆ కొత్తదనంలోని టాలెంట్ ని గుర్తించడం మానేసి ,ప్రోత్సహించడం మానేసి అదిమిపెట్టి ఉంచాలనే ఆలోచన ఆమెకి స్థిరమైన స్థితిని కల్పించలేకపోయింది . ఆ ఒక్కటీ ప్రక్కకి తీసేస్తే ,తనకి కుటుంబపరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్కూల్ లో తన పెదిమల మీద చిరునవ్వు ,పిల్లలతో తాను ఇంటరాక్ట్ ఐన తీరు చాలా అందంగా ఉండేవి .. కధలు చెప్పడం,ఆటలు ఆడించడం , తన పనిలో ఖచ్చితంగా ఉండడం , ఇలాంటి లక్షణాలు ఆకర్షించేవి .. తన నుండి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి .తనని సంప్రదించే నా డ్యూటీ పరంగా ఏ స్టెప్ అయినా తీసుకునేదానిని ..అందువల్ల ఆమె నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు . ఏ మనిషికి అయినా కొన్ని బలహీనతలు ఉంటాయి . ఆ కొన్ని బలహీనతలకి లొంగడం వల్ల ఆమె తన భాద్యతలు తీరకుండానే అనారోగ్యానికి లోనై తాను కోరుకున్నట్లుగా స్కూల్ లోనే కుప్పకూలడం జరిగింది ( కార్డియాక్ అరెస్ట్)... డైరెక్టుగా హాస్పిటల్ కి తీసుకువెళదామని ఎంత కోరినా ,కేవలం ఒక్కరి కారణంగా ఆమెకి తక్షణ చికిత్స అందకపోవడంతో గిల గిల లాడి ఆలస్యంగా ఆటో లో హాస్పిటల్ కి తరలించే సమయంలో ఆమె తన ప్రాణాలు వదిలేసింది అని తెలిసి మనసు భయంకరంగా విలవిలలాడింది.. ఆ సమయంలో నేను పెద్దవారు కదా అని వారి మాటలు వినకుండా డైరెక్టుగా హాస్పిటల్ కి తీసుకు వెళ్లినట్లైతే .. ఏమో ,బ్రతికిఉండే అవకాశం దొరికి ఉండేదేమో .. ఏది ఏమైనా ఆమె చివరి క్షణాలు అలా జరగడం అశాంతికి ,దుఃఖ్ఖానికి గురి చేసినాయి .. చిన్నపిల్లల్లో ఆమె కనబడేవారు .. పిల్లల్ని తీసుకుని ఆడిటోరియం కి వెళితే ఆమె గొంతు వినబడేది ..ఆమె నవ్వు కనబడేది . ఈనాటికి నాకళ్ళ ముందు కదలాడుతూ ఉంటారు.. మరణించిన నాటి నుండి ఆమె నాతొ ఎదో చెప్పాలని కోరుకుంటున్న దృశ్యం నాకు అనుభవం .. పదమూడవ రోజు తర్వాత ఆ అనుభవం మాయం ఐంది .. కానీ, ఆమె చెప్పాలనుకుంటున్నారు అని భావిస్తున్న విషయం నాకు తర్వాత స్కూల్ లో తెలిసింది .. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం .. కానీ, భగవంతుడు ఆమె ఆత్మని తనలో చేర్చుకోమని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేకపోయాను.. 'ఓయ్ రుక్మిణి' అని పిలిచే ఆమె పిలుపు నాకు ఇప్పటికీ వినిపిస్తున్నట్లే అనిపిస్తుంది .. మనం కొన్ని భ్రమలలో ఉండిపోతుంటాము కదా .. .
.
Monday, July 18, 2016
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
గురుపౌర్ణమి సందర్భం గా ఈరోజు నేను నా జీవితం లోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను ..క్వార్టర్లీ పరీక్షలు మొదలైనాయి .. అందరం బిజీ బిజీ .. క్వశ్చన్ పేపర్లు , పిల్లలని పరీక్షలకి ప్రేపర్ చేయించడం తర్వాతి ఘట్టం ఇన్విజిలేషన్ .ఇన్విజిలేషన్ అంటే మాకు పెద్ద పరీక్ష . sixth నుండి టెన్త్ వరకూ పర్వాలేదు . వాళ్ళని ముందే మెంటల్లీ ప్రిపేర్ చేసేదానిని .. నో కాపీయింగ్ .. ఓన్లీ వాళ్ళు చదివినవి గుర్తు తెచ్చుకుని వ్రాయడం వరకు మాత్రమే .. అందువల్ల ముఖ్యంగా మా అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి స్ట్రిక్ట్ నెస్ ఉండడం తో మేము అందరం ఫాలో అయ్యేవాళ్ళము . విజ్ఞాన్ గొప్పదనాల్లో అది కూడా ఒకటి . చిన్నపిల్లలు అంటే మూడు, నాలుగు తరగతుల వాళ్ళకి అందరికీ కాకపోయినా కొందరికి మనం question చదివి వినిపిస్తేనే వాళ్ళు జవాబు గుర్తు తెచ్చుకుని వ్రాయగలరు . . బెస్ట్ అనిపించుకునే అంటే కూలంకషంగా ఉపాధ్యాయుడు చెప్పినది ,వారు చదువుకుని ఇతరుల సహాయం అవసరం లేని పిల్లలు సీరియస్ గా తమ పని తాము చేసుకుంటారు .. కానీ పైన నేను చెప్పిన వాళ్ళకి కొంత అటెన్షన్ పే చెయ్యాలి .లేదంటే వాళ్ళు వెర్బల్ గా చెప్పగలిగినది వ్రాత ద్వారా చూపించలేక పోతే ఫెయిల్ అయిపోతారు .. అది మరింత బాధాకరం . సాధారణంగా వాళ్ళకి వ్రాత పని కూడా ఎక్కువ ఇచ్చినా, ఈరోజు ఎంత ప్రాక్టీస్ చేయించినా మరుసటిరోజుకి మామూలుగా అయిపోతారు .. అటువంటి ఇన్విజిలేషన్ లో మూడవ తరగతి కి వెళ్లడం జరిగింది. . పరీక్ష సమయం తొమ్మిది గంటల నుండి . పలకరింపులు , అటెండెన్స్ , పేపర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది .. ముందుగానే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల వాళ్ళు సీరియస్ గా పరీక్షలు వ్రాసుకుంటున్నారు .. ఒక గంట గడిచిన తర్వాత పిల్లలు అందరూ సరిగా వ్రాస్తున్నారా లేదా అని చెక్ చేసిన తర్వాత ఒక గంటకి క్లాసురూమ్ లోని డయాస్ మీదకి వెళ్లి పిల్లల వైపు తిరిగిన నాకు షాక్ -
రూం అంతా వెలుగుతో నిండిపోయింది . అది మిరుమిట్లు గొలుపుతుంది అంటారు కదా ఆ వెలుగు .. ఆ వెలుగులో ప్రతి ఒక్క
స్టూడెంటూ ఒక బాబా. దాదాపు కొన్ని నిమిషాల పాటు అనుభవించాను .. హృదయం లో ఏదో ఆనందం వర్ణింప తరం కానిది .
ఎ
వరికి చెప్పాను ? ఎవరితో పంచుకోను ? బాబా నా హృదయం లో ఉన్నారు అన్న సంగతి ఎవరికీ తెలియదు .. నా మౌనం లో ఉండేవారు . అంతే . అందుకే ఆ క్లాసురూం నాకో దేవాలయం . చాలా సంవత్సరాలు అక్కడే ఎక్కువ ఉండేదానిని .. అదే సమయంలో మా ప్రిన్సిపాల్ కస్తూరి గారు అదే రూం వద్దకి వచ్చి "రుక్మిణీ , మా అమ్మాయికి నువ్వు ఇచ్చిన బాబా విగ్రహం ( టెన్త్ చదివేది . తన birthday స్టాఫ్ రూం లో సెలెబ్రేట్ చేశారు . తండ్రి మరణించిన దుఃఖం నుండి మరపింపడానికి ) దేవుడి బల్ల మీద పెట్టిన దగ్గరనుండి నాకు ఏదో సంతోషం కలుగుతుంది మనసులో . దేవుడంటే నమ్మకం లేని నాకు నమ్మకం కలగసాగింది (కారణం ,ఆమెకి వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చారట )" అంటూ ఎంతో ఉద్వేగంతో చెప్పసాగారు .. " నేను ఇవ్వడం కాదు . ఆ పాపకి ఏమి గిఫ్ట్ ఇవ్వాలి ? ఏదో ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉన్న నేను పెన్ ఇద్దామని అనుకున్నాను ముందు . మనీ కోసం బాగ్ లో చేయిపెట్టాను . లోపల మా తోడికోడలు కోసం ఉంచిన బాబా విగ్రహం కనిపించింది . తన గురించి తెచ్చింది కదా అని కొంతసేపు మనసులో కొట్టుమిట్టాడాను .. ఏమైందో తెలియదు ఆ విగ్రహం తీసి ఆ పాపకి ఇవ్వడం ,తాను థాంక్స్ చెప్పడం జరిగింది .. ఎవరో అన్నారు కూడా -వాళ్ళకి దేవుడు మీద నమ్మకం లేదనుకుంటా అని .. కానీ ఆ తర్వాత తెలిసింది -ఆమె తిరగని గుడి లేదు ,చేయించని పూజ లేదు అని . భర్త లేని దుఃఖం ఆ విధంగా బాబా ఆమెకి తీర్చినందుకు సంతోషపడ్డాము .. ఆమె మామూలు మనిషయ్యింది ..గురువుని నమ్మిన వారు అన్యాయానికి గురి కారు అన్న మాటకి ఒక ఉదాహరణ ఇది .. నాకు అనిపించేది మా మానేజ్మెంట్ కి చెప్పి ఆ క్లాసురూం ని ఏనాటికైనా ఒక దేవాలయంగా మార్చమని .. కానీ ,అంత సాహసం మనం చేయలేము - అది వాళ్ళ ఇష్టం కదా .. అదే స్కూల్ లో ఇంకో రూం ఉండేది . లైబ్రరీ రూం . ఆ రూం లోనికి వెళ్లిన కొంతసేపటికి నా శరీరం నా ప్రమేయం లేకుండా ధ్యాన స్థితికి వెళ్లిపోయేది .. చాలా కష్టమయ్యేది నిభాయించుకోవడం .. అందుకే నాకు మా స్కూల్ ఒక దేవాలయం . ఒక పవిత్ర స్థలం . నాకు పుట్టినిల్లు . ఒక పర్ణశాల .. అందులోనే పిల్లలనే పూలను చూసాను .. టీచర్లు అనే వృక్షాలని చూసాను . రిజల్ట్ అనే ఫలాలని చూసాను . పని చేస్తూనే ఉండేదానిని.. బాబా కోసం తపన చెందుతూనే ఉండేదానిని . నిరంతర ఆనందంతో ఉండేదానిని . . ఆ ఆనందం ఈనాటికీ హృదయంలో ఉంది .. స్కూల్ మానెయ్యడానికి కొన్ని కారణాలు . ఆ కొన్ని కారణాలలో ఒకటి మా అమ్మగారు (ఆ తర్వాత మరణించారు ). మా చెల్లెలు -తనకి తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం విషయం లో నా వంతు సహాయం . అత్తమామలు -వాళ్ళ బాగోగులు -సక్రమంగా నిర్వర్తించడానికి బాబా సహకారం ఉంది . పిల్లలు -వాళ్ళని ఒక ఇంటివారు చేయడం మిగిలివుంది .. అందుకే బాబాని ఈ రోజు పిల్లల గురించి కూడా ప్రార్ధన చేస్తాను .. ఒకనాడు నా డైరీ లో ముందు పేజీ లో -బాబా ,నా చుట్టూ ఉన్న ఎవరికీ ఏ కష్టం కలిగించకు . వారి కష్టాలు అన్నీ నాకే ఇవ్వు. . వారందరినీ సంతోషంగా ఉంచు . నేను సంతోషంగా ఉంటాను" అని వ్రాసినది చదివిన నా స్నేహితురాలు "అదేమిటి ,అలా కోరుకున్నావు " అంది . . అందరూ సంతోషంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉంటాము . ఆ విషయం లో నేను స్వార్ధపరురాలినే అని చెప్పాను .. అందుకే - నేను కష్టపడినా, ఎన్ని ఇబ్బందులకు గురి అయినా అది నా వరకే పరిమితం .. ఈనాడు గురు పౌర్ణమి సందర్భంగా నేను నా తల్లిగా,తండ్రిగా,గురువుగా దైవంగా , స్నేహితుడుగా మనసా వాచా భావించిన ఆ బాబా ని వేడుకునేది ఒక్కటే -జన్మతః లభించిన గొప్ప వరాలైన ఈ మౌనం , ఈ చిరునవ్వు నన్ను ఈనాటికీ విడిపోకుండా నా మరణ సమయంలో కూడా నా పెదిమల మీద చిరునవ్వు ,హృదయంలో ఆనందం నాతోనే ఉండాలని , ఎక్కడనుండి వచ్చానో ఆ ఒడిలోనికే చేరాలని కోరుకుంటున్నాను . .మహోన్నతమైన స్త్రీ జన్మ లభించినందుకు ఒకందుకు సంతోషం,ఒకందుకు దుఃఖం .. నా ఈ జన్మ చాలు . మరుజన్మ వద్దు ..
Tuesday, June 28, 2016
గుర్తుకొస్తున్నాయి......: విజ్ఞాన్ రత్తయ్య గారు అనే మాట ఏనాడో న్యూస్ పేపర్ ...
గుర్తుకొస్తున్నాయి......:
విజ్ఞాన్ రత్తయ్య గారు అనే మాట ఏనాడో న్యూస్ పేపర్ ...
: విజ్ఞాన్ రత్తయ్య గారు అనే మాట ఏనాడో న్యూస్ పేపర్ లో చదివాను .. ఎవరికో ఏదో జరిగింది . ఏం జరిగిందో విషయం గుర్తు లేదు గాని, ఒక వాక్యం గుర్...
rukmini devi
విజ్ఞాన్ రత్తయ్య గారు అనే మాట ఏనాడో న్యూస్ పేపర్ లో చదివాను .. ఎవరికో ఏదో జరిగింది . ఏం జరిగిందో విషయం గుర్తు లేదు గాని, ఒక వాక్యం గుర్తుండిపోయింది - ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లినవిజ్ఞాన్ విద్యాలయాల అధినేత లావు రత్తయ్య గారు అని వ్రాసారు పేపర్ లో .. కనీసం ఫోటో కూడా చూడలేదు . అంతకన్నా ఎక్కువగా చదవలేదు . . వారి ఒక సంస్థలో చేరుతానని గాని, నా సర్వీసెస్ అక్కడ ఉంటాయి అని గాని ఏ మాత్రం ఊహించనిది .. ప్రతి సంవత్సరం రత్తయ్య గారి జన్మదినం నాడు స్టాఫ్ మెంబెర్స్ కి ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరుగుతుందట .. ఆనాడూ నేను జాయిన్ అయినా మూడవరోజునే ఇంక్రిమెంట్స్ ఇవ్వడం , క్రొత్తగా చేరినవారికి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వడం అన్నది ఆయన మాత్రమే చేయగలరు . . తిమ్మాపురం విజ్ఞాన్ పెద్ద భవనాలతో కూడి ఆకర్షణీయంగా ఉంటుంది .. ఆ క్యాంపస్ నాకు కొత్త కాదు . బాబు చదువుతున్నప్పుడు తరచుగా అక్కడికి వెళ్లడం ,వెళ్ళినప్పుడు స్టాఫ్ మెంబెర్స్ మాకు భోజనానికి ఆహ్వానించడం - అక్కడి వైభవం వర్ణించ లేనిది .. రుచికరమైన ,ఆరోగ్యకరమైన ప్రతిరోజూ ఒక పెళ్లి విందు లాంటి భోజనం .. ఒక విద్యాసంస్థ ఇటువంటి భోజనం, ఇటువంటి క్యాంపస్ (ఒక యూనివర్సిటీ ని తలపింపజేస్తుంది) , అక్కడి ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు పేరెంట్స్ ని డీల్ చేసే తీరు , విద్యార్థులను ట్రీట్ చేసే తీరు నిజంగా అభినందనీయం .. అందుకే మా వారితో సహా మా కుటుంబ సభ్యులం అందరమూ ఫిదా అయిపోయాము .. ఏదైనా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ conduct చేయాలంటే ఆ అందం వేరు .. మానేజర్ శ్రీనివాసరావు గారి ఆద్వర్యం లో (వినయశీలి ) ఒక పద్దతిలో జరిగిపోతూ ఉండేవి .
మా రత్తయ్య గారు క్యాంపస్ లో అడుగుపెట్టినప్పుడు అందరూ అమ్మో డైరెక్టర్ గారు వచ్చారట అని అనుకునేవారు .. ఎప్పుడైనా క్యాంపస్ లో క్లాస్ కి వెళ్లి వస్తున్నప్పుడు సడెన్ గా ఎదురైనా ఆయనలో ఏ మాత్రం భేషజం కనబడేది కాదు . సైలెంట్ గా ప్రక్కకు తప్పుకుని వెళ్లిపోయేదానిని. .
ఆ మధ్య కాలంలో ఓపెన్ హెర్ట్ విత్ ఆర్ కె అన్న ప్రోగ్రామ్ లో రత్తయ్య గారి ఇంటర్వ్యూ విన్నాను . చివరగా ఆయన వ్యక్తం చేసిన కొన్ని విషయాలు నిజమే కదా . ఇటువంటి ఎడ్యుకేషనిస్ట్ ని రాజకీయ నాయకులు ఎందుకు ఒక విద్యా మంత్రిగా తీసుకోవడం లేదు అని అనిపించింది .
కారణం- స్కూల్ లో అటెండ్ అయినా మీటింగ్స్ సారాంశం , దృష్టి అంతా కేవలం విద్యార్థులు . వారిని ఎం చేస్తే ,ఎలా ఏ విధంగా చదివిస్తే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి ? ఫ్రెషర్స్ ని టీచింగ్ లో తీసుకోవడం అనే ప్రయోగం ఎంత ఎనర్జిటిక్ గా పని చేస్తుంది, అందువల్ల వచ్చే రిజల్ట్ ఎంత excellent గా ఉంటుంది అన్నది ప్రయోగాత్మకంగా చూపించిన వ్యక్తి ఆయన .. అంటే భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని తెలుసుకోగలిగే ,చెప్పగలిగే సామర్ధ్యం ఆయనలో ఉంది .. పని చేయలేని అంటే ఆయన కోరుకున్న రీతిలో పని చేయలేని వారు నిరభ్యంతరంగా ఇన్స్టిట్యూషన్ వదిలి వెళ్ళవచ్చు అని చెప్పగలిగిన వ్యక్తి ఆయన ... మరి మన government ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది ఇటువంటి వ్యక్తులని అని భాద కలుగుతుంది .. హి ఈజ్ ఎ లెర్నర్ ,హి ఈజ్ ఏ టీచర్ , హి ఈజ్ ఆ మెంటోర్ .. హి ఈజ్ ఆ ఫాదర్ (సంతృప్తి కరంగా భోజనం తిన్న విద్యార్థి ఎదుగుదల ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక వ్యక్తి ) అని గట్టిగా చెప్పగలను .. ఇవి పది సంవత్సరాల విజ్ఞాన్ విద్యాలయంలో పనిచేసి నా అనుభవం తో చూసి చెప్పిన మాటలు.. ఏ మాత్రం అసత్యాలు లేవు ఇందులో . . స్టాఫ్ ఎవరూ నెగటివ్ గా మాట్లాడడం నేను చూడలేదు . అభిమానించేవారు తప్ప .. ఎవరూ ఆయనని తిట్టుకోవడం చూడలేదు .. అటువంటి వ్యక్తి ని ప్రజల కోసం తప్పకుండా ఒక పదవిలో (విద్యకి సంబందించి ) ఉంచాల్సిందే అని నా అభిప్రాయం ,
Sunday, June 26, 2016
స్కూల్ బస్ దిగిన తర్వాత ఒక్కసారి చుట్టూ చూస్తే ఒక పర్ణశాల వాతావరణం -పెద్ద పెద్ద చెట్లు, hut ఆకారంలో తరగతి గదులు సిమెంట్ తో కట్టినవే .. విశాలమైన గ్రౌండ్ , ప్రశాంత వాతావరణం- చాలా హాయిని ఇచ్చి మనసుని ఆహ్లాదపరిచేవి .. ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పినట్లు గుర్తు లేదు - విజ్ఞాన్ విద్యాలయం . గుంటూరు మెయిన్ క్యాంపస్ . లావు రత్తయ్య గారిది .. మాది సిరిపురం క్యాంపస్ .. మనసులో కేవలం పని, పిల్లలు , వాళ్ళని ఎలా డీల్ చెయ్యాలి ? వాళ్ళని ఏ విధంగా ఎంటర్టైన్ చెయ్యాలి , ఏ టాపిక్స్ ఎలా టీచ్ చేస్తే వాళ్ళనుండి మంచి result దొరుకుతుంది ? result అంటే ఇక్కడ కేవలం మార్కులు కాదు . అనేకం ఉంటాయి .. అవి అన్నీ నిదానంగా వివరిస్తాను . ఒక మెథడాలజీ ఉంటుంది . అది క్రమం తప్పకుండా పాటిస్తే ఒక మంచి టీచర్ ,కొన్ని వందల మంది మంచి విద్యార్థులు కనబడతారు .. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఒక టాపిక్ ఇచ్చి డ్రాయింగ్ వేయమంటే ఏ ఒక్కరి చిత్రం మరొకరి చిత్రాలతో కలవకుండా విభిన్న రీతులలో ఉంటుందో , ఏ ఒక్కరి ఆలోచన మరొకరి ఆలోచనకు విభిన్నంగా ఉంటుందో అలానే వారి నాలెడ్జ్ కూడా విభిన్న రీతులతో బయటపడుతుంది .. ఒకసారి ఒక టీచర్ పిల్లలను స్కూల్ క్యాంపస్ గురించి , వాళ్ళు ఎలా ఫీల్ ఔతున్నది కనుక్కోవడానికి ప్రశ్నలు వేస్తే ఒక స్టూడెంట్ -" ఏముంది మేడం ,అన్నీ హట్ సి కదా. అదే మా ముంబై లో అయితే నా " అన్నాడట . వెంటనే ఆదిత్య అన్న స్టూడెంట్ - "excuse me . ఇవి హట్స్ కావు .. పిరమిడ్స్ shaped క్లాసురూంస్ .. ఉయ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ to స్టడీ ఇన్ థిస్ స్కూల్ . . అని ఆవేశంగా అన్నాడట .. ఆ విషయం విన్న ప్రతి ఒక్క టీచర్ మదిలో అప్పటి వరకూ కలగని విచిత్రమైన ఫీలింగ్ కలిగింది .. అదే క్యాంపస్ లో కాలేజ్ కూడా ఉండేది .. జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్మీడియేట్ క్లాస్సేస్ జరుగుతుండేవి .. స్కూల్ మరియు కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ చాలా కలివిడిగా అందరూ ఒక్కటిగానే ఫీల్ అయ్యేవారు .. క్రమేణా స్థలంలో సగ భాగం వరుణ్ మోటార్స్ వాళ్ళు కొనుక్కోవడం ,స్కూల్ మిగిలిన సగ భాగానికి పరిమితం చేయడం , కాలేజ్ కొంచెం దూరం లో షిఫ్ట్ చేయడం , తదుపరి టెన్త్ క్లాస్ కూడా తరలించడం వంటి మార్పులు జరగడం .. ఇవన్నీ మానేజ్మెంట్ వారి నిర్ణయాలు ..
వాటితో మనకి సంబంధం అవసరం లేదు . ఇక స్కూల్ కి వెన్నుముక ప్రిన్సిపాల్ అయితే ఆయనకి కుడి,ఎడమ భుజాలుగా మా రమణ మరియు మురళి సార్లు ఉండేవారు . మా బాబు అక్కడ చదువుతున్నప్పటికీ నేను తన మదర్ అని ఎవరికీ తెలియకూడదనే కండిషన్ మా అబ్బాయిది .. ముందుగా నేను పలానా అని తెలిసిన టీచర్లు ఉన్నా మా బాబు చెప్పినట్లు ఉండేదానిని .. ఈ ఇద్దరు సార్లకు మా బాబు అంటే చాలా ఇష్టం .. మేడం గారూ ,మేము చూసుకుంటాము లెండి అనేవారు .. స్టాఫ్ ఏమాత్రం భేషజం లేకుండా కలిసి మెలిసి ఉండేవారు . . స్కూల్ లో క్రమశిక్షణ అమలుకు వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించేవారు .. అక్కడ జాయిన్ అయినా నాలుగు నెలల తర్వాత మేము ఇల్లు కట్టుకోవడం ప్రారంభించడం , మరో నాలుగైదు నెలల లో గృహ ప్రవేశం , ప్రత్యేకం గా మా స్టాఫ్ అందరూ స్కూల్ బస్సెస్ లో రావడం ,వారికి సాదర సత్కారాలు మా ఇంటి తరపున ఇవన్నీ ఒక మధుర జ్ఞాపకాలు అయితే
మీ అన్నదమ్ములుగా మేము ఏం చేయాలో మాకు పనులు అప్పగించండి అని రమణ మరియు మురళిగార్లతో పాటు మా పి . టి. సార్ భాస్కర్ గారు మా ఇంటికి రావడం, మా ఇంటిల్లిపాది చాలా చాలా సంతోషించారు . . స్కూల్ స్టాఫ్ తరపున మా ఆడపిల్లగా మీకు పట్టుచీర కావాలా అని అడిగినప్పుడు " ఇంతవరకు ఎవరికైనా ఇటువంటి మధుర జ్ఞాపకం దొరుకుతుందా అనిపించింది ".. మా అమ్మా, నాన్న గార్లు మాకు బట్టలు తీసుకున్నారు అని తెలిసి వాళ్ళు సాయిబాబా వెండి షో పీస్ ఇవ్వడం జరిగింది . ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే స్కూల్ లో cultural ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయితే పండగ వాతావరణమే .. ఆటల పోటీలు , డాన్సులు , పాటలు ,ఒకటేమిటి జీవితానికి సరిపడా అన్నీ .. ఆ ఆనందం వర్ణింపరానిది ..
స్కూల్ లో చదువు ఒక ఎత్తు అయితే , ఎక్జామ్స్ కి question పేపర్లు ప్రేపరే చేయడం క్రిటికల్ .. అది మంచి విధానం కూడా . పూర్తి సిలబస్ కవర్ అయ్యేలా మరియు ఎవరూ మాల్ ప్రాక్టీస్ కి పాల్పడకుండా మూడు సెట్లు ప్రేపరే చేయమని చెప్పేవారు . అమ్మో అనిపించినా , ఆనందంగా చేసేవారం. అదే కారణం విజ్ఞాన్ స్కూల్ స్టూడెంట్స్ ఏ సమయంలో అయినా ఏ టాపిక్ అయినా అనర్గళంగా చెప్ప గలిగేవారు .. ఆ స్కూల్ లో పనిచేసే టీచర్లు ని ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ appointment ఉండేది అని అప్పట్లో టాక్ ..
అందరూ టీచర్లు నాకు ఇన్స్పిరేటివ్ గా తీసుకునేదానిని . . వారిలో ఒక్కొక్కరిలో ఒకో టాలెంట్ లేదా మల్టిపుల్ టాలెంట్స్ కనబడతాయి .. అవి గ్రహించి ఆచరణలో పెట్టుకుంటే చాలు మనం సక్సెస్ అవుతాము .
టీచర్ అంటే ఇలానే ఉండాలి అని నాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి . నేను అక్షరాలా పాటించేదానిని . .
అధిక అలంకరణలు ,ఎక్సట్రా ఆకర్షణ లు పిల్లలను ఆకర్షించవు .. తలలో పూలు పెట్టుకోవడానికి (మనం హిందువులం ,మనకి ఆ హక్కు ఉంది అని అనేవారిని చూసాను ) టీచింగ్ సమయాల్లో -నేను విరుద్ధం (అంటే స్కూల్ క్యాంపస్ లో) . మేడం ,please అని పిల్లలు request చేస్తారు .. వాళ్ళకి అదో ఆనందం .. నేను " తప్పకుండా" అని బాగ్ లో వారి ముందే అతి జాగ్రత్తగా పెట్టి ఇంటికి తెచ్చుకునేదానిని . గ్లాస్ లో నీళ్లు పోసి , పూలు అందులో ఉంచి నాలుగైదు రోజులు నిమిరి చూసుకునేదానిని .. నాకు అదో ఆనందం ..
వేణుగోపాలరావు గారి తర్వాత మాకు ప్రిన్సిపాల్ గా కస్తూరి మేడం రావడం జరిగింది . . ఆమె శ్రీ చైతన్య కాలేజ్ డైరెక్టర్ గారి సిస్టర్ .. చాలా సిస్టమాటిక్ గా ఉండేవారు .. స్టాఫ్ తో అధికంగా గడపడానికి,వారికిఇన్ స్ట్ర క్షన్స్ ఇస్తూ , పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ,ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలో ,ఎక్కడ నవ్వుతూ ఉండాలో అలా ఉంటూ మమ్మల్ని ఇలా చేయండి ,ఎలా చేయండి అంటూ ఇంచుమించు తన సమయం మా అందరితో , పిల్లల తల్లిదండ్రులతో వెచ్చిస్తూ ఉండేవారు .. వేణుగోపాల రావు గారు సబ్స్టిట్యూషన్స్ వర్క్ చెప్పినా నేను వెనక్కి ఉండేదానిని ..ఎందుకంటే ప్రిన్సిపాల్ కంటే సీనియర్స్ గా ఫీల్ ఐయ్యేవారు ఉండేవారు .. కానీ ,కస్తూరి గారు ఫస్ట్ మీటింగ్ తర్వాత మీటింగ్ లో రమణి (మాకు బాగా సీనియర్ ) మేడం తో పాటుగా ఇంకో ఇన్ ఛార్జ్ కావాలి నాకు అని సడెన్ గా నా పేరు announce చేసేసారు .. ఇది ఊహించనిది . . అంతే -భగవంతుడా అనుకుని పర్సనల్ గా వెళ్లి "నా కంటే సేనియర్స్ ఉండగా నేను ఆ వర్క్ చేయడం కష్టం. అలా మంచిది కూడా కాదు " అని చెప్తే ఆమె ఒక్క మాటే అన్నారు - సీనియారిటీ అన్నది ఎంతో మందికి వస్తుంది .. వర్క్ quality అన్నది అతి కొద్దిమందికి ఉంటుంది " అని .
ఆ మాట విని నేను అవాక్కు .. ఎందుకంటే -నాకు టీచింగ్ అనుభవం లేదండి అని నేను చెప్పినప్పుడు మా వేణుగోపాలరావు గారు, " నా దగ్గర హైలీ qualified double పిజి లు ,ఎక్సపీరియెన్స్డ్ టీచర్లు ఉన్నారు .. నాకు కావలసింది qualification కాదు quality " అని అన్నారు .. అప్పుడూ ఇలానే అవాక్కయ్యాను ..
మళ్లీ ఈరోజు కస్తూరి గారు .. మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాను . .
ఇక లావు రత్తయ్య గారి గురించి నా మనసులోని మాట ,ఈనాటి వరకూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు రేపు చెప్తాను . . ఈరోజు ఒకే మాట తో ముగిస్తాను - "HI IS THE REAL EDUCATIONIST" .. ఇలా అనిపించడానికి నేను విన్న , చూసిన ,గమనించిన విషయాలు, స్టాఫ్ కి ఆయన ఏ సమయం లో ఎంత సపోర్టివ్ గా ఉంటారు ? విద్యా విధానంలో ఆయన అనుసరించిన పద్ధతులు ,నాకు "ఎస్" అనిపించేవి ఎప్పటికప్పుడు . .
,
rukmini devi
Thursday, June 23, 2016
గుర్తుకొస్తున్నాయి......: పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతి హో .... నాకు చాలా ...
గుర్తుకొస్తున్నాయి......: పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతి హో .... నాకు చాలా ...
: పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతి హో .... నాకు చాలా చాలా ఇష్టమైన పాట .... నా స్కూల్ నాకు దైవ సమానం .. . కారణం తర్వాత చెప్తాను . స్కూల్ లో చేర...
rukmini devi
పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతి హో .... నాకు చాలా చాలా ఇష్టమైన పాట .... నా స్కూల్ నాకు దైవ సమానం .. . కారణం తర్వాత చెప్తాను . స్కూల్ లో చేరకముందు మా బాబు "మా ,నువ్వు స్కూల్ లో అడుగు పెట్టిన తర్వాత కొందరిని చూసి ఆశ్చర్యపోకు .. నిదానంగా అర్ధం అవుతుంది". అని మాత్రం చెప్పాడు . . నిజంగానే అక్కడికి వెళ్లిన తర్వాత అర్ధం అయింది .. నేను మొదటినుండి పెరిగిన వాతావరణం వల్ల , నేను ఉన్న తీరు వల్ల చూస్తే కొంచెం ఆశ్చర్య పడవచ్చు కానీ , కాజువల్ గా తీసుకున్నాను .. యాభై ,అరవైలలో ఉన్న వారు లిప్స్టిక్స్ , ఓవర్ మేకప్ , రకరకాల బొట్లు .. నాకు ఇబ్బంది అనిపించలేదు కానీ , స్టూడెంట్స్ కామెంట్స్ ఎందుకు చేస్తారా అన్నది అర్ధమైంది . నేను రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్ లో చదివేటపుడు చంద్రకళ అని ఒక లెక్చరర్ ఉండేవారు .. ఆరోజుల్లోనే ఆమె మంచి మేకప్ తో సింగిల్ పల్లూ తో , కట్ బ్లౌసేస్ తో ఉండేవారు .. అది చూసిన అలవాటు మీద ఇక్కడ ఇబ్బంది అనిపించలేదు .మనసులో హాయిగానే ఫీల్ అయ్యేదానిని .. నా వర్క్ చూసిన ప్రిన్సిపాల్ స్టడీ అవర్స్ కి ఉండాలండి అని అన్నారు .. గుండెల్లో రాయి పడినట్లు అయింది . అసలు స్కూల్ లో జాయిన్ అయ్యేముందు లక్ష ఆలోచించాను . కారణం మా వారు . నాగపూర్ లో ఉండేటప్పుడు మోర్నింగ్ లంచ్ బాక్స్ ఇచ్చేయడం వల్ల ఒంటరిగా ఉండడం వల్ల ఉదయం నుండి నన్ను ఎవరూ తిన్నావా అని అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల నాకు టైం కి ఇది తినాలి ,అది తినాలి అన్న ఆలోచన ఉండేది కాదు .. కారణం -చిన్నప్పటినుండి టైం కి అమ్మ ఇచ్చింది తినడం .లేదంటే అలా ఉండడం .. కేవలం చదువు - క్లాస్ బుక్స్ మాత్రమే కాదు . నొవెల్స్ ,మ్యాగజైన్స్ ,, మీద మాత్రమే దృష్టి ఉండేది .. ఒక్కపూట భోజనం తో ఎన్నో సంవత్సరాలు .. వైజాగ్ వచ్చిన తర్వాత మావారి ఆఫీస్ మాకు పది నిమిషాల దూరం .. లంచ్ టైం కి ఇంటికి రావడంతో ఇద్దరం కలిసి తినడం, తనతోనే ఎక్కువ అట్టాచ్మెంట్ ఉండడం వల్ల స్కూల్ లో అందరిలో ఉన్నా తినలేకపోయేదానిని .. మాకు లంచ్ కొన్ని రోజులు స్కూల్ లో ప్రొవైడ్ చేసేవారు . .. excellent food .. కానీ ,ధ్యాస అంతా ఇంటిమీద ఉండడం వల్ల నాకు తిండి మీద ఆసక్తి ఉండేది కాదు .. బ్రేక్ టైం లో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి (క్లాస్ రూం లో ) నా చుట్టూ ఉన్న పిల్లలకు తినిపిస్తూ చాలా ఆనందం పొందేదానిని . వాళ్ళతో కబుర్లు చెప్తూ .. మా బాబు క్లాసుమేట్స్ కూడా నా దగ్గరికి వచ్చేసేవారు .. నిజ్జంగా L.K.G. నుండి టెన్త్ క్లాస్ వరకు పిల్లలతో ఎంతటి అనుబంధం ఏర్పడిందంటే వాళ్లకి అనుక్షణం అందుబాటులో ఉండేంత .. నేను మావారితో ,స్కూల్ లో పిల్లలతో తప్ప మరెవరితోనూ ఎక్కువ మాట్లాడడం అలవాటు ఉండేది కాదు .. కారణం నా చిన్నప్పటి నుండి నన్ను అంటిపెట్టుకుని తోడూ ,నీడలా నా మౌనం .. నా మొహంలో చిరునవ్వు .. ఈ రెండూ నన్ను పది సంవత్సరాలు మా కొలీగ్స్ నన్ను గౌరవించేలా చేశాయి . మా స్కూల్ మానేజ్మెంట్ నాకు అవసరం అయిన సమయంలో నాకు ఉపయోగపడేలా చేశాయి .. "ఇన్ని జరుగుతున్నా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి . మీలా ఉండగలిగితే బాగుండును ".అని . "కొంతమందిని చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఏమీ అనలేదు . ఫేస్ వాల్యూ మరి " అని . ఇలా మాట్లాడిన వారినీ చూసాను .. " సైలెంట్ గా ఉండడం గొప్ప కాదు పిరికితనం , చాతకానితనం " అని, అని -సైలెంట్ గా ఉండడం ఎంత మంచిదో ఎదురు దెబ్బలు తింటే గాని అర్ధం కాలేదు - అని ఒప్పుకున్న వారినీ చూసాను .. ఎవరికీ ఎదురు తిరగలేదు . . వాదించలేదు . అదే మౌనం ,అదే నవ్వు .. ఆ రెండింటికీ చాలా చాలా రుణపడి ఉన్నాను మరి .
టీచింగ్ లో ఉన్నప్పుడు నా క్లాస్ రూం బయట నుండే వెళ్లి పోయేవారు ప్రిన్సిపాల్ .. స్టడీ అవర్స్ లో కూడా మీరేనా ఉన్నారు అని బయటనుండే వెళ్ళిపోయేవారు .. అది నాకు లభించిన మరో గౌరవం . . పిల్లలు నా చుట్టూ ఉండేవారు .. అది నాకు దొరికిన ప్రేమ .. ఇవన్నీ ఎప్పటికన్నా ఇప్పుడు బాగా అర్ధం అవుతున్నాయి .. నా మొట్ట మొదటి జీతం వారం రోజుల తర్వాత ఏడువందల యాభై రూపాయలు .. సాలరీస్ వచ్చాయి అని అందరూ ఆఫీస్ రూం కి వెళ్తుంటే నేను వెనక్కి తగ్గాను .. మొహమాటంగా వెళ్ళాను మా రమణీ మేడం గొడవ చేస్తే .. చేయి చెప్పడానికి ఇబ్బంది పడ్డాను . అలవాటు లేకపోవడం వల్ల .. అదేమిటండి . మీ డబ్బులు . మీరు కష్టపడ్డారు .మొహమాటం ఎందుకు అని చెప్పిన సురేష్ (క్యాషియర్ ) మాటలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి .. అవి భద్రంగా అలా తెచ్చి మావారికి ఇస్తే - "నువ్వు ఉంచుకో"- అన్నారు .. "నాదంటూ ఏమీ వద్దు" అని అంటే , "సరే, లోపల ఉంచు " అని ఆయన మొహమాట పడ్డారు .. అప్పుడు అర్ధం అయింది -నా జీతం రెండువేల రెండు వందలకి ఫిక్స్ అయిందని .. నాతో పాటు జాయిన్ అయినవారి కన్నా నాలుగు వందల రూపాయలు ఎక్కువ అని , అందుకే comparisions అని ..
rukmini devi
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)