Total Pageviews

Thursday, June 23, 2016

పల్ పల్ దిల్ కే  పాస్ తుమ్ రహతి హో .... నాకు చాలా చాలా ఇష్టమైన పాట .... నా స్కూల్ నాకు దైవ సమానం .. . కారణం తర్వాత చెప్తాను . స్కూల్ లో చేరకముందు మా బాబు "మా ,నువ్వు స్కూల్ లో అడుగు పెట్టిన తర్వాత కొందరిని చూసి ఆశ్చర్యపోకు .. నిదానంగా  అర్ధం అవుతుంది". అని మాత్రం చెప్పాడు . . నిజంగానే అక్కడికి వెళ్లిన తర్వాత అర్ధం అయింది .. నేను మొదటినుండి పెరిగిన వాతావరణం వల్ల , నేను ఉన్న తీరు వల్ల చూస్తే కొంచెం ఆశ్చర్య పడవచ్చు కానీ , కాజువల్ గా తీసుకున్నాను .. యాభై ,అరవైలలో ఉన్న వారు లిప్స్టిక్స్ , ఓవర్ మేకప్ , రకరకాల బొట్లు .. నాకు ఇబ్బంది అనిపించలేదు కానీ , స్టూడెంట్స్ కామెంట్స్ ఎందుకు చేస్తారా అన్నది అర్ధమైంది . నేను రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్ లో చదివేటపుడు చంద్రకళ అని ఒక లెక్చరర్ ఉండేవారు .. ఆరోజుల్లోనే ఆమె మంచి మేకప్ తో సింగిల్ పల్లూ తో , కట్ బ్లౌసేస్ తో ఉండేవారు .. అది చూసిన అలవాటు మీద ఇక్కడ ఇబ్బంది అనిపించలేదు .మనసులో హాయిగానే ఫీల్ అయ్యేదానిని .. నా వర్క్ చూసిన ప్రిన్సిపాల్ స్టడీ అవర్స్ కి ఉండాలండి అని అన్నారు .. గుండెల్లో రాయి పడినట్లు అయింది . అసలు స్కూల్ లో జాయిన్ అయ్యేముందు లక్ష ఆలోచించాను . కారణం మా వారు . నాగపూర్ లో ఉండేటప్పుడు మోర్నింగ్ లంచ్ బాక్స్ ఇచ్చేయడం వల్ల ఒంటరిగా ఉండడం వల్ల ఉదయం నుండి నన్ను ఎవరూ తిన్నావా అని అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల నాకు టైం కి ఇది తినాలి ,అది తినాలి అన్న ఆలోచన ఉండేది కాదు .. కారణం -చిన్నప్పటినుండి టైం కి అమ్మ ఇచ్చింది తినడం .లేదంటే అలా ఉండడం .. కేవలం చదువు - క్లాస్ బుక్స్ మాత్రమే కాదు . నొవెల్స్ ,మ్యాగజైన్స్ ,, మీద మాత్రమే దృష్టి ఉండేది .. ఒక్కపూట భోజనం తో ఎన్నో సంవత్సరాలు .. వైజాగ్ వచ్చిన తర్వాత మావారి ఆఫీస్ మాకు పది నిమిషాల దూరం .. లంచ్ టైం కి ఇంటికి రావడంతో ఇద్దరం కలిసి తినడం, తనతోనే ఎక్కువ అట్టాచ్మెంట్ ఉండడం వల్ల స్కూల్ లో అందరిలో ఉన్నా తినలేకపోయేదానిని .. మాకు లంచ్ కొన్ని రోజులు స్కూల్ లో ప్రొవైడ్  చేసేవారు . .. excellent food .. కానీ ,ధ్యాస అంతా ఇంటిమీద ఉండడం వల్ల నాకు తిండి మీద ఆసక్తి ఉండేది కాదు .. బ్రేక్ టైం లో  టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి (క్లాస్ రూం లో )  నా చుట్టూ ఉన్న పిల్లలకు తినిపిస్తూ చాలా ఆనందం పొందేదానిని . వాళ్ళతో కబుర్లు చెప్తూ .. మా బాబు క్లాసుమేట్స్ కూడా నా దగ్గరికి వచ్చేసేవారు .. నిజ్జంగా L.K.G. నుండి టెన్త్ క్లాస్ వరకు పిల్లలతో ఎంతటి అనుబంధం ఏర్పడిందంటే వాళ్లకి అనుక్షణం అందుబాటులో ఉండేంత .. నేను మావారితో ,స్కూల్ లో పిల్లలతో తప్ప మరెవరితోనూ ఎక్కువ మాట్లాడడం అలవాటు ఉండేది కాదు .. కారణం నా చిన్నప్పటి నుండి నన్ను అంటిపెట్టుకుని తోడూ ,నీడలా   నా మౌనం .. నా మొహంలో చిరునవ్వు .. ఈ రెండూ నన్ను పది సంవత్సరాలు మా కొలీగ్స్ నన్ను గౌరవించేలా చేశాయి . మా స్కూల్ మానేజ్మెంట్ నాకు అవసరం అయిన  సమయంలో  నాకు ఉపయోగపడేలా చేశాయి .. "ఇన్ని జరుగుతున్నా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి . మీలా ఉండగలిగితే బాగుండును ".అని . "కొంతమందిని చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఏమీ అనలేదు . ఫేస్ వాల్యూ మరి " అని . ఇలా మాట్లాడిన వారినీ చూసాను .. " సైలెంట్ గా ఉండడం గొప్ప కాదు పిరికితనం , చాతకానితనం " అని, అని -సైలెంట్ గా ఉండడం ఎంత మంచిదో ఎదురు దెబ్బలు తింటే గాని అర్ధం కాలేదు - అని ఒప్పుకున్న వారినీ చూసాను .. ఎవరికీ ఎదురు తిరగలేదు . . వాదించలేదు . అదే మౌనం ,అదే నవ్వు .. ఆ రెండింటికీ చాలా చాలా రుణపడి ఉన్నాను మరి . 
టీచింగ్ లో ఉన్నప్పుడు నా క్లాస్ రూం బయట నుండే వెళ్లి పోయేవారు ప్రిన్సిపాల్ .. స్టడీ అవర్స్ లో కూడా మీరేనా ఉన్నారు అని బయటనుండే వెళ్ళిపోయేవారు .. అది నాకు లభించిన మరో గౌరవం . . పిల్లలు నా చుట్టూ ఉండేవారు .. అది నాకు దొరికిన ప్రేమ .. ఇవన్నీ ఎప్పటికన్నా ఇప్పుడు బాగా అర్ధం అవుతున్నాయి .. నా మొట్ట మొదటి జీతం వారం రోజుల తర్వాత ఏడువందల యాభై రూపాయలు .. సాలరీస్ వచ్చాయి అని అందరూ ఆఫీస్ రూం కి వెళ్తుంటే నేను వెనక్కి తగ్గాను .. మొహమాటంగా వెళ్ళాను మా రమణీ మేడం గొడవ చేస్తే .. చేయి చెప్పడానికి ఇబ్బంది పడ్డాను . అలవాటు లేకపోవడం వల్ల .. అదేమిటండి . మీ డబ్బులు . మీరు కష్టపడ్డారు .మొహమాటం ఎందుకు అని చెప్పిన సురేష్ (క్యాషియర్ ) మాటలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి .. అవి భద్రంగా అలా తెచ్చి మావారికి ఇస్తే - "నువ్వు ఉంచుకో"- అన్నారు .. "నాదంటూ ఏమీ వద్దు" అని అంటే , "సరే, లోపల  ఉంచు " అని ఆయన మొహమాట పడ్డారు .. అప్పుడు అర్ధం అయింది -నా జీతం రెండువేల రెండు వందలకి ఫిక్స్ అయిందని .. నాతో పాటు జాయిన్ అయినవారి కన్నా నాలుగు వందల రూపాయలు ఎక్కువ అని , అందుకే comparisions అని .. 
     





       







              rukmini devi

2 comments:

  1. madhuramaina jnaapakaalanDee...upaadhyaayinigaa marinni jnaapakaalanu andistaarani eduruchUstunnaanu...mounam...chirunavvu mee gouravaanni inumaDimpajEsaayi.. ani chadivi naalo chiru darahaasam...

    ReplyDelete
  2. థాంక్ యూ విశాలాక్షి గారు .. అవి రెండూ నాకు బలాలు .. అవే బలహీనతలు .. నిదానంగా చెప్తాను ..

    ReplyDelete