Total Pageviews

Sunday, June 26, 2016

 స్కూల్ బస్ దిగిన తర్వాత  ఒక్కసారి చుట్టూ చూస్తే ఒక పర్ణశాల వాతావరణం -పెద్ద పెద్ద చెట్లు, hut  ఆకారంలో  తరగతి గదులు సిమెంట్ తో కట్టినవే .. విశాలమైన గ్రౌండ్ , ప్రశాంత వాతావరణం- చాలా హాయిని ఇచ్చి మనసుని ఆహ్లాదపరిచేవి .. ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పినట్లు గుర్తు లేదు - విజ్ఞాన్ విద్యాలయం . గుంటూరు మెయిన్  క్యాంపస్ . లావు రత్తయ్య గారిది .. మాది సిరిపురం క్యాంపస్ .. మనసులో కేవలం పని, పిల్లలు , వాళ్ళని ఎలా డీల్ చెయ్యాలి ? వాళ్ళని ఏ విధంగా ఎంటర్టైన్ చెయ్యాలి , ఏ టాపిక్స్ ఎలా టీచ్ చేస్తే వాళ్ళనుండి మంచి result దొరుకుతుంది ? result అంటే ఇక్కడ కేవలం మార్కులు కాదు . అనేకం ఉంటాయి .. అవి అన్నీ నిదానంగా వివరిస్తాను . ఒక మెథడాలజీ ఉంటుంది . అది క్రమం తప్పకుండా పాటిస్తే ఒక మంచి టీచర్ ,కొన్ని వందల మంది మంచి విద్యార్థులు కనబడతారు .. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఒక టాపిక్ ఇచ్చి డ్రాయింగ్ వేయమంటే ఏ ఒక్కరి చిత్రం మరొకరి చిత్రాలతో కలవకుండా విభిన్న రీతులలో ఉంటుందో , ఏ ఒక్కరి ఆలోచన మరొకరి ఆలోచనకు విభిన్నంగా ఉంటుందో అలానే వారి నాలెడ్జ్ కూడా విభిన్న రీతులతో బయటపడుతుంది .. ఒకసారి ఒక టీచర్ పిల్లలను స్కూల్ క్యాంపస్ గురించి , వాళ్ళు ఎలా ఫీల్  ఔతున్నది కనుక్కోవడానికి ప్రశ్నలు వేస్తే ఒక స్టూడెంట్ -" ఏముంది మేడం ,అన్నీ హట్ సి కదా. అదే మా ముంబై లో అయితే నా " అన్నాడట . వెంటనే ఆదిత్య అన్న స్టూడెంట్ - "excuse me . ఇవి హట్స్ కావు .. పిరమిడ్స్ shaped క్లాసురూంస్ .. ఉయ్ షుడ్   ఫీల్ ప్రౌడ్ to  స్టడీ ఇన్ థిస్ స్కూల్ . . అని ఆవేశంగా అన్నాడట .. ఆ విషయం విన్న ప్రతి ఒక్క టీచర్ మదిలో అప్పటి వరకూ కలగని విచిత్రమైన ఫీలింగ్ కలిగింది .. అదే క్యాంపస్ లో కాలేజ్ కూడా ఉండేది .. జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్మీడియేట్ క్లాస్సేస్ జరుగుతుండేవి .. స్కూల్ మరియు కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ చాలా కలివిడిగా అందరూ ఒక్కటిగానే ఫీల్ అయ్యేవారు .. క్రమేణా స్థలంలో సగ భాగం వరుణ్ మోటార్స్ వాళ్ళు కొనుక్కోవడం ,స్కూల్ మిగిలిన సగ భాగానికి పరిమితం చేయడం , కాలేజ్ కొంచెం దూరం లో షిఫ్ట్ చేయడం , తదుపరి టెన్త్ క్లాస్ కూడా తరలించడం వంటి మార్పులు జరగడం .. ఇవన్నీ మానేజ్మెంట్ వారి నిర్ణయాలు .. 

వాటితో మనకి సంబంధం అవసరం లేదు . ఇక స్కూల్ కి వెన్నుముక ప్రిన్సిపాల్ అయితే ఆయనకి కుడి,ఎడమ భుజాలుగా మా రమణ మరియు మురళి సార్లు ఉండేవారు . మా బాబు అక్కడ చదువుతున్నప్పటికీ నేను తన మదర్ అని ఎవరికీ తెలియకూడదనే కండిషన్ మా అబ్బాయిది .. ముందుగా నేను పలానా అని తెలిసిన టీచర్లు ఉన్నా మా బాబు చెప్పినట్లు ఉండేదానిని .. ఈ ఇద్దరు సార్లకు మా బాబు అంటే చాలా ఇష్టం .. మేడం గారూ ,మేము చూసుకుంటాము లెండి అనేవారు .. స్టాఫ్ ఏమాత్రం భేషజం లేకుండా కలిసి మెలిసి ఉండేవారు . . స్కూల్ లో క్రమశిక్షణ అమలుకు వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించేవారు .. అక్కడ జాయిన్ అయినా నాలుగు నెలల తర్వాత మేము ఇల్లు కట్టుకోవడం ప్రారంభించడం , మరో నాలుగైదు నెలల లో గృహ ప్రవేశం , ప్రత్యేకం గా మా స్టాఫ్ అందరూ స్కూల్ బస్సెస్ లో రావడం ,వారికి సాదర సత్కారాలు మా ఇంటి తరపున ఇవన్నీ ఒక మధుర జ్ఞాపకాలు అయితే 
మీ అన్నదమ్ములుగా మేము ఏం చేయాలో మాకు పనులు అప్పగించండి అని రమణ మరియు మురళిగార్లతో పాటు మా పి . టి. సార్ భాస్కర్ గారు మా ఇంటికి రావడం, మా ఇంటిల్లిపాది చాలా చాలా సంతోషించారు . . స్కూల్ స్టాఫ్ తరపున మా ఆడపిల్లగా మీకు పట్టుచీర కావాలా అని అడిగినప్పుడు " ఇంతవరకు ఎవరికైనా ఇటువంటి మధుర జ్ఞాపకం దొరుకుతుందా అనిపించింది ".. మా అమ్మా, నాన్న గార్లు మాకు బట్టలు తీసుకున్నారు అని తెలిసి వాళ్ళు సాయిబాబా వెండి షో పీస్ ఇవ్వడం జరిగింది . ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే స్కూల్ లో cultural ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయితే పండగ వాతావరణమే .. ఆటల పోటీలు , డాన్సులు , పాటలు ,ఒకటేమిటి జీవితానికి సరిపడా అన్నీ .. ఆ ఆనందం వర్ణింపరానిది .. 
స్కూల్ లో చదువు ఒక ఎత్తు అయితే , ఎక్జామ్స్ కి question పేపర్లు ప్రేపరే చేయడం క్రిటికల్ .. అది మంచి విధానం కూడా . పూర్తి సిలబస్ కవర్ అయ్యేలా మరియు ఎవరూ మాల్ ప్రాక్టీస్ కి పాల్పడకుండా మూడు సెట్లు ప్రేపరే చేయమని చెప్పేవారు . అమ్మో అనిపించినా , ఆనందంగా చేసేవారం. అదే కారణం విజ్ఞాన్ స్కూల్ స్టూడెంట్స్ ఏ సమయంలో అయినా ఏ టాపిక్ అయినా అనర్గళంగా చెప్ప గలిగేవారు .. ఆ స్కూల్ లో పనిచేసే టీచర్లు ని ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ appointment ఉండేది అని అప్పట్లో టాక్ .. 
అందరూ టీచర్లు నాకు ఇన్స్పిరేటివ్ గా తీసుకునేదానిని . . వారిలో ఒక్కొక్కరిలో ఒకో టాలెంట్ లేదా మల్టిపుల్ టాలెంట్స్ కనబడతాయి .. అవి గ్రహించి ఆచరణలో పెట్టుకుంటే చాలు మనం సక్సెస్ అవుతాము . 
టీచర్ అంటే ఇలానే ఉండాలి అని నాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి . నేను అక్షరాలా పాటించేదానిని . . 
 అధిక అలంకరణలు ,ఎక్సట్రా ఆకర్షణ లు  పిల్లలను ఆకర్షించవు .. తలలో పూలు పెట్టుకోవడానికి (మనం హిందువులం ,మనకి ఆ హక్కు ఉంది అని అనేవారిని చూసాను ) టీచింగ్ సమయాల్లో -నేను విరుద్ధం (అంటే స్కూల్ క్యాంపస్ లో) . మేడం ,please అని పిల్లలు request చేస్తారు .. వాళ్ళకి అదో ఆనందం .. నేను " తప్పకుండా" అని బాగ్ లో వారి ముందే అతి జాగ్రత్తగా పెట్టి ఇంటికి తెచ్చుకునేదానిని . గ్లాస్ లో నీళ్లు పోసి , పూలు అందులో ఉంచి నాలుగైదు   రోజులు నిమిరి చూసుకునేదానిని .. నాకు అదో ఆనందం ..  
వేణుగోపాలరావు గారి తర్వాత మాకు ప్రిన్సిపాల్ గా కస్తూరి మేడం రావడం జరిగింది . .  ఆమె శ్రీ చైతన్య కాలేజ్ డైరెక్టర్ గారి సిస్టర్ .. చాలా సిస్టమాటిక్ గా ఉండేవారు .. స్టాఫ్ తో అధికంగా గడపడానికి,వారికిఇన్ స్ట్ర క్షన్స్ ఇస్తూ   , పిల్లలతో   ఇంటరాక్ట్ అవుతూ ,ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలో ,ఎక్కడ నవ్వుతూ ఉండాలో అలా ఉంటూ మమ్మల్ని ఇలా చేయండి ,ఎలా చేయండి అంటూ ఇంచుమించు తన సమయం మా అందరితో , పిల్లల తల్లిదండ్రులతో వెచ్చిస్తూ ఉండేవారు .. వేణుగోపాల రావు గారు సబ్స్టిట్యూషన్స్ వర్క్ చెప్పినా నేను వెనక్కి ఉండేదానిని ..ఎందుకంటే ప్రిన్సిపాల్ కంటే సీనియర్స్ గా ఫీల్ ఐయ్యేవారు ఉండేవారు ..  కానీ ,కస్తూరి గారు ఫస్ట్ మీటింగ్ తర్వాత మీటింగ్ లో రమణి (మాకు బాగా సీనియర్ ) మేడం తో పాటుగా ఇంకో ఇన్ ఛార్జ్ కావాలి నాకు అని సడెన్ గా నా పేరు announce చేసేసారు .. ఇది ఊహించనిది . . అంతే -భగవంతుడా అనుకుని పర్సనల్ గా వెళ్లి "నా కంటే సేనియర్స్ ఉండగా నేను ఆ వర్క్ చేయడం కష్టం. అలా మంచిది కూడా కాదు " అని చెప్తే ఆమె ఒక్క మాటే అన్నారు - సీనియారిటీ అన్నది ఎంతో మందికి వస్తుంది .. వర్క్ quality  అన్నది అతి కొద్దిమందికి ఉంటుంది " అని . 
ఆ మాట విని నేను అవాక్కు .. ఎందుకంటే -నాకు టీచింగ్ అనుభవం లేదండి అని నేను చెప్పినప్పుడు మా వేణుగోపాలరావు గారు, " నా దగ్గర హైలీ qualified double పిజి లు ,ఎక్సపీరియెన్స్డ్ టీచర్లు ఉన్నారు .. నాకు కావలసింది qualification కాదు quality "  అని అన్నారు .. అప్పుడూ ఇలానే అవాక్కయ్యాను .. 
మళ్లీ ఈరోజు కస్తూరి గారు .. మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాను . . 
ఇక లావు రత్తయ్య గారి గురించి నా మనసులోని మాట ,ఈనాటి వరకూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు రేపు చెప్తాను . . ఈరోజు ఒకే మాట తో ముగిస్తాను - "HI IS THE REAL EDUCATIONIST" .. ఇలా అనిపించడానికి నేను విన్న , చూసిన ,గమనించిన విషయాలు, స్టాఫ్ కి ఆయన ఏ సమయం లో ఎంత సపోర్టివ్ గా ఉంటారు ? విద్యా విధానంలో ఆయన అనుసరించిన పద్ధతులు ,నాకు "ఎస్" అనిపించేవి ఎప్పటికప్పుడు .  . 
     
                 ,                

























rukmini devi

No comments:

Post a Comment