Total Pageviews

Monday, December 19, 2011

ఏ  తోట లో విరబూసేనో ఈ పూలు ....
స్కూల్  లో అడుగు పెట్టిన దగ్గర నుండి, పని చేసినన్ని  సంవత్సరాలూ నా మనసులో ప్రతి క్షణం మెదిలిన ఈ పదాలు నాకు ఏదో తెలియని , వివరించ లేని ఆనందాన్ని, అనుభూతిని కలిగించేవి ..
నేను జాయిన్ ఐన మొదట్లో మా కాలేజి principal ఉమా మహేశ్వర రావు గారు ఒక స్పీచ్ లో .." క్లాసు రూం లో అడుగు పెట్టి , తిరిగి బయటకు వచ్చేప్పుడు మన పెదిమల మీద కదలాడే చిరునవ్వు చెబుతుంది మనం ఆ రోజు పాఠం  ఎంత బాగా చెప్పాము అన్నది " అని చెప్పారు .. విన్న వెంటనే నాకు అదో తృప్తి .. నన్ను నేను పరిశీలించు కున్నాను .. ఎస్ .. అది నాకు దొరుకుతుంది ప్రతి సారి అని ..ఆ తర్వాత కూడా నన్ను నేను పరిశీలించు కుంటూ వుండే దానిని ...ఆ క్షణాలు మిస్ కాకూడదని  ..మనం పిల్లలు అందరిని ఒకే దృష్టి తో చూస్తాము .. ఒకే యాంగిల్ లో చూస్తాము .కానీ , క్లాసు రూం లో నలబై మంది పిల్లలు వుంటే, ఎనబై కళ్ళతో మనల్ని పరీక్షిస్తారు అని మా తెలుగు మురళి కృష్ణ మాస్టారు గారు చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చి పోయేదానిని కాదు. ..ప్రతి స్టూడెంట్ కి ఏదో ఒక టాలెంట్ వుంటుంది ..అవి పైకి చెప్పాలని ,చూపించాలనే తాపత్రయం తో వుంటారు ..అది కనిపెట్టి వాళ్ళను ప్రోత్సహిస్తూ, వాళ్లకు అనుగుణంగా మమ్మల్ని మేము మలచు కుంటూనే , వాళ్ళు మా మాట వినేట్లు  చేసే వాళ్లము..మ్యూజిక్ ని ఇష్టపడని వాళ్ళు వుండరు .. అందులో పిల్లలు మరీ .. క్లాసు లో కనీసం పది నిమిషాలు వారితో పాటలు పాడిస్తూ, తప్పని సరిగా రెండు పాటలు చెప్తూ వుండే దానిని  .. "సారే జహాసే అచ్చా , హమ్ హోంగే కామ్ యాబ్      ... .చాలా చాలా ఆనందకర క్షణాలు అవి ...లంచ్ టైం లో  వాళ్ళ తో కబుర్లు చెప్తూ ,కలసి భోజనం చెయ్యడం , కూరల పేర్లు చెప్పుకుంటూ , రకరకాల విన్యాసాలు చేస్తూ ..నిజంగా అదృష్టమే .. కదా ..
పిల్లలే పూలు .. మరి వాళ్ళు పూలు తెచ్చి ఇస్తే ?   చాలా అపురూపం గా వుండేది ..తలలో పెట్టుకుంటే వాడి పోతాయని , అర చేతిలో వుంచి ..మురిసిపోయే వాళ్లము ...      rukmini devi

3 comments:

  1. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు...పూలిమ్మని రెమ్మ రెమ్మకు...ఎంత తొందరలే హరి పూజకు..పొద్దు పొడవక ముందె పూలిమ్మని...పాట మదిలో మెదిలింది...ఏ తోటలో విరబూసెనో ఈ పూలు అని చదవగానే...పిల్లలే పూలు...అన్న మాట..పిల్లలు పూలు తెచ్చి ఇస్తే అపురూపంగా చూసుకోవడం ..హాట్సాఫ్..రుక్మిణిదేవిగారు...

    ReplyDelete