Total Pageviews

Wednesday, September 14, 2016

మనిషి ఒంటరిగా బ్రతకలేడు .. అందుకే తనవారు అంటూ తనకి బంధుత్వాలని ,స్నేహితులనీ ఏర్పరచుకుంటాడు . ఇది స్వార్ధం ఏ మాత్రం కాదు .. పురాణ ఇతిహాసాలలో కూడా  ఈ బంధాలు లేని దేవుళ్ళు లేరు .. ఐతే ఏర్పరచుకున్న బంధుత్వాలను గాని ,స్నేహాలను గాని నిలబెట్టుకోడానికి ఎన్నో వదులుకోవాలి .ఎంతో   త్యాగం చెయ్యాలి. ఇక్కడ నేను అనే స్వార్ధంతో ఏర్పరచుకున్న బంధుత్వం గాని ,స్నేహం గాని శాశ్వతంగా నిలవవు .. కానీ, దురదృష్టం, ఎక్కువ బంధాలు స్వార్ధంతో కూడినవే అవుతాయి . ఈ బంధాల్లో "నేను ఆనందంగా ఉండాలి" అన్న కోరిక ఎదుటి వ్యక్తి మనోభావాలతో పనిలేకుండా ఉండడం వల్ల ఈ స్నేహాలు ,బంధుత్వాలు నిలవక మధ్యలో విచ్ఛిన్నం కావడం చూస్తూనే ఉన్నాము .. నేను స్కూల్ లో రకరకాల మనస్తత్వాలతో కూడిన (ఈ వాక్యం నాకు నచ్చనిది .కానీ ఇక్కడ ఉదాహరించక తప్పడం లేదు ..  .. చదివేవారికి అర్ధం ఐ ఉంటుంది .. ఎందుకంటే -అందరూ ఒకేలా ఉంటారు అన్న ఆలోచనా తత్వంతో ఉన్న నాకు ఎవరు, ఎలా ఉన్నా పట్టేది కాదు. ఇది చాలా ముఖ్యమైన కారణం నేను చాలా ప్రశాంతంగా ఉండగలగడం ,ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయగలగడం .. స్కూల్ లో చేరిన తర్వాత నన్ను ఆకర్షించిన వ్యక్తి రమణీ మాడం .. ఆమె చాలా సీనియర్ అని తెల్సింది . అదే సీనియారిటీ భావన తర్వాత తర్వాత ఆమెకి మనసుకి శాంతి లేకుండా చేసింది .. చాలా మందిని ఇబ్బంది పెట్టింది ..కొత్తదనానికి ఆహ్వానం పలికినా ఆ కొత్తదనంలోని టాలెంట్ ని గుర్తించడం మానేసి ,ప్రోత్సహించడం మానేసి అదిమిపెట్టి ఉంచాలనే ఆలోచన ఆమెకి స్థిరమైన స్థితిని కల్పించలేకపోయింది .    ఆ ఒక్కటీ ప్రక్కకి తీసేస్తే ,తనకి కుటుంబపరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్కూల్ లో తన పెదిమల మీద చిరునవ్వు ,పిల్లలతో తాను ఇంటరాక్ట్ ఐన తీరు చాలా అందంగా ఉండేవి .. కధలు చెప్పడం,ఆటలు  ఆడించడం , తన పనిలో ఖచ్చితంగా ఉండడం , ఇలాంటి లక్షణాలు ఆకర్షించేవి .. తన నుండి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి .తనని సంప్రదించే నా డ్యూటీ పరంగా  ఏ స్టెప్ అయినా తీసుకునేదానిని ..అందువల్ల ఆమె నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు . ఏ మనిషికి అయినా కొన్ని బలహీనతలు ఉంటాయి . ఆ కొన్ని బలహీనతలకి లొంగడం వల్ల ఆమె తన భాద్యతలు తీరకుండానే అనారోగ్యానికి లోనై  తాను కోరుకున్నట్లుగా స్కూల్ లోనే కుప్పకూలడం   జరిగింది ( కార్డియాక్ అరెస్ట్)... డైరెక్టుగా హాస్పిటల్ కి తీసుకువెళదామని ఎంత కోరినా ,కేవలం ఒక్కరి కారణంగా ఆమెకి తక్షణ చికిత్స అందకపోవడంతో గిల గిల లాడి ఆలస్యంగా ఆటో లో హాస్పిటల్  కి తరలించే సమయంలో ఆమె తన ప్రాణాలు వదిలేసింది అని తెలిసి మనసు భయంకరంగా విలవిలలాడింది.. ఆ సమయంలో నేను పెద్దవారు కదా అని వారి మాటలు వినకుండా డైరెక్టుగా హాస్పిటల్ కి తీసుకు వెళ్లినట్లైతే .. ఏమో ,బ్రతికిఉండే అవకాశం దొరికి ఉండేదేమో .. ఏది ఏమైనా ఆమె చివరి క్షణాలు అలా జరగడం అశాంతికి ,దుఃఖ్ఖానికి గురి చేసినాయి .. చిన్నపిల్లల్లో ఆమె కనబడేవారు .. పిల్లల్ని తీసుకుని ఆడిటోరియం కి వెళితే ఆమె గొంతు వినబడేది ..ఆమె నవ్వు కనబడేది . ఈనాటికి నాకళ్ళ ముందు కదలాడుతూ ఉంటారు.. మరణించిన నాటి నుండి ఆమె నాతొ ఎదో చెప్పాలని కోరుకుంటున్న దృశ్యం నాకు అనుభవం .. పదమూడవ రోజు తర్వాత ఆ అనుభవం మాయం ఐంది .. కానీ, ఆమె చెప్పాలనుకుంటున్నారు అని భావిస్తున్న విషయం నాకు తర్వాత స్కూల్ లో తెలిసింది .. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం .. కానీ, భగవంతుడు ఆమె ఆత్మని తనలో చేర్చుకోమని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేకపోయాను.. 'ఓయ్ రుక్మిణి' అని పిలిచే ఆమె పిలుపు నాకు ఇప్పటికీ వినిపిస్తున్నట్లే అనిపిస్తుంది .. మనం కొన్ని భ్రమలలో ఉండిపోతుంటాము కదా ..     .   

 .           




        

No comments:

Post a Comment