Total Pageviews

Monday, July 18, 2016

గురుపౌర్ణమి శుభాకాంక్షలు

గురుపౌర్ణమి సందర్భం గా ఈరోజు నేను నా జీవితం లోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను ..క్వార్టర్లీ  పరీక్షలు మొదలైనాయి .. అందరం బిజీ బిజీ .. క్వశ్చన్ పేపర్లు , పిల్లలని పరీక్షలకి ప్రేపర్  చేయించడం తర్వాతి ఘట్టం ఇన్విజిలేషన్ .ఇన్విజిలేషన్ అంటే మాకు పెద్ద పరీక్ష . sixth నుండి టెన్త్ వరకూ పర్వాలేదు . వాళ్ళని ముందే మెంటల్లీ ప్రిపేర్ చేసేదానిని .. నో కాపీయింగ్ .. ఓన్లీ వాళ్ళు చదివినవి గుర్తు తెచ్చుకుని వ్రాయడం వరకు మాత్రమే .. అందువల్ల ముఖ్యంగా మా అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి స్ట్రిక్ట్ నెస్ ఉండడం తో మేము అందరం ఫాలో అయ్యేవాళ్ళము . విజ్ఞాన్ గొప్పదనాల్లో అది కూడా ఒకటి .    చిన్నపిల్లలు అంటే మూడు, నాలుగు  తరగతుల వాళ్ళకి అందరికీ కాకపోయినా కొందరికి మనం question చదివి వినిపిస్తేనే వాళ్ళు జవాబు గుర్తు తెచ్చుకుని వ్రాయగలరు . . బెస్ట్ అనిపించుకునే అంటే కూలంకషంగా ఉపాధ్యాయుడు చెప్పినది ,వారు చదువుకుని ఇతరుల సహాయం అవసరం లేని పిల్లలు సీరియస్ గా తమ పని తాము చేసుకుంటారు .. కానీ పైన నేను చెప్పిన వాళ్ళకి కొంత అటెన్షన్ పే చెయ్యాలి .లేదంటే వాళ్ళు వెర్బల్ గా చెప్పగలిగినది వ్రాత ద్వారా చూపించలేక పోతే ఫెయిల్ అయిపోతారు .. అది మరింత బాధాకరం . సాధారణంగా వాళ్ళకి వ్రాత పని కూడా ఎక్కువ ఇచ్చినా, ఈరోజు ఎంత ప్రాక్టీస్ చేయించినా మరుసటిరోజుకి మామూలుగా అయిపోతారు .. అటువంటి ఇన్విజిలేషన్ లో మూడవ తరగతి కి వెళ్లడం జరిగింది. . పరీక్ష సమయం తొమ్మిది గంటల నుండి . పలకరింపులు , అటెండెన్స్ , పేపర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది .. ముందుగానే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల వాళ్ళు సీరియస్ గా పరీక్షలు వ్రాసుకుంటున్నారు .. ఒక గంట గడిచిన తర్వాత   పిల్లలు అందరూ సరిగా వ్రాస్తున్నారా లేదా అని  చెక్ చేసిన తర్వాత   ఒక గంటకి క్లాసురూమ్ లోని   డయాస్ మీదకి వెళ్లి పిల్లల వైపు తిరిగిన నాకు షాక్ - రూం అంతా వెలుగుతో నిండిపోయింది . అది మిరుమిట్లు గొలుపుతుంది అంటారు కదా ఆ వెలుగు .. ఆ వెలుగులో ప్రతి ఒక్క స్టూడెంటూ ఒక బాబా.  దాదాపు కొన్ని నిమిషాల పాటు అనుభవించాను .. హృదయం లో ఏదో ఆనందం వర్ణింప తరం కానిది . వరికి చెప్పాను ? ఎవరితో పంచుకోను ? బాబా నా హృదయం లో  ఉన్నారు అన్న సంగతి ఎవరికీ తెలియదు .. నా మౌనం లో ఉండేవారు . అంతే . అందుకే ఆ క్లాసురూం నాకో దేవాలయం . చాలా సంవత్సరాలు  అక్కడే ఎక్కువ ఉండేదానిని .. అదే  సమయంలో మా ప్రిన్సిపాల్ కస్తూరి గారు అదే రూం వద్దకి వచ్చి "రుక్మిణీ , మా అమ్మాయికి నువ్వు ఇచ్చిన బాబా విగ్రహం ( టెన్త్ చదివేది . తన birthday స్టాఫ్ రూం లో సెలెబ్రేట్ చేశారు . తండ్రి మరణించిన దుఃఖం నుండి మరపింపడానికి ) దేవుడి బల్ల మీద పెట్టిన దగ్గరనుండి నాకు ఏదో సంతోషం కలుగుతుంది మనసులో . దేవుడంటే నమ్మకం లేని నాకు నమ్మకం కలగసాగింది (కారణం ,ఆమెకి వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చారట )" అంటూ ఎంతో ఉద్వేగంతో చెప్పసాగారు .. " నేను ఇవ్వడం కాదు . ఆ పాపకి ఏమి గిఫ్ట్ ఇవ్వాలి ? ఏదో ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉన్న నేను పెన్ ఇద్దామని అనుకున్నాను ముందు . మనీ కోసం బాగ్ లో చేయిపెట్టాను . లోపల మా తోడికోడలు కోసం ఉంచిన బాబా విగ్రహం కనిపించింది . తన గురించి తెచ్చింది కదా అని కొంతసేపు మనసులో కొట్టుమిట్టాడాను .. ఏమైందో తెలియదు ఆ విగ్రహం తీసి ఆ పాపకి ఇవ్వడం ,తాను థాంక్స్ చెప్పడం జరిగింది .. ఎవరో అన్నారు కూడా -వాళ్ళకి దేవుడు మీద నమ్మకం లేదనుకుంటా అని .. కానీ ఆ తర్వాత తెలిసింది -ఆమె తిరగని గుడి లేదు ,చేయించని పూజ లేదు అని .  భర్త లేని దుఃఖం ఆ విధంగా బాబా ఆమెకి తీర్చినందుకు సంతోషపడ్డాము .. ఆమె మామూలు మనిషయ్యింది ..గురువుని నమ్మిన వారు అన్యాయానికి గురి కారు అన్న మాటకి ఒక ఉదాహరణ ఇది .. నాకు అనిపించేది మా మానేజ్మెంట్ కి చెప్పి ఆ క్లాసురూం ని ఏనాటికైనా ఒక దేవాలయంగా మార్చమని .. కానీ ,అంత సాహసం మనం చేయలేము - అది వాళ్ళ ఇష్టం కదా .. అదే స్కూల్ లో ఇంకో రూం ఉండేది . లైబ్రరీ రూం . ఆ రూం లోనికి వెళ్లిన కొంతసేపటికి నా శరీరం నా ప్రమేయం లేకుండా ధ్యాన స్థితికి వెళ్లిపోయేది .. చాలా కష్టమయ్యేది నిభాయించుకోవడం .. అందుకే నాకు మా స్కూల్ ఒక దేవాలయం . ఒక పవిత్ర స్థలం . నాకు పుట్టినిల్లు . ఒక పర్ణశాల .. అందులోనే పిల్లలనే పూలను చూసాను .. టీచర్లు అనే వృక్షాలని చూసాను . రిజల్ట్ అనే ఫలాలని చూసాను . పని చేస్తూనే ఉండేదానిని.. బాబా కోసం తపన చెందుతూనే ఉండేదానిని . నిరంతర ఆనందంతో ఉండేదానిని . . ఆ ఆనందం ఈనాటికీ హృదయంలో ఉంది .. స్కూల్ మానెయ్యడానికి కొన్ని కారణాలు . ఆ కొన్ని కారణాలలో ఒకటి మా అమ్మగారు (ఆ తర్వాత మరణించారు ). మా చెల్లెలు -తనకి తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం విషయం లో నా వంతు సహాయం . అత్తమామలు -వాళ్ళ బాగోగులు -సక్రమంగా నిర్వర్తించడానికి బాబా సహకారం ఉంది . పిల్లలు -వాళ్ళని ఒక ఇంటివారు చేయడం మిగిలివుంది .. అందుకే బాబాని ఈ రోజు పిల్లల గురించి కూడా ప్రార్ధన చేస్తాను .. ఒకనాడు నా డైరీ లో ముందు పేజీ లో -బాబా ,నా చుట్టూ  ఉన్న ఎవరికీ ఏ కష్టం కలిగించకు . వారి కష్టాలు అన్నీ నాకే ఇవ్వు. . వారందరినీ సంతోషంగా ఉంచు . నేను సంతోషంగా ఉంటాను" అని వ్రాసినది చదివిన నా స్నేహితురాలు "అదేమిటి ,అలా కోరుకున్నావు " అంది . . అందరూ సంతోషంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉంటాము . ఆ విషయం లో నేను స్వార్ధపరురాలినే అని చెప్పాను .. అందుకే - నేను కష్టపడినా, ఎన్ని ఇబ్బందులకు గురి అయినా అది నా వరకే పరిమితం .. ఈనాడు గురు పౌర్ణమి సందర్భంగా నేను నా తల్లిగా,తండ్రిగా,గురువుగా దైవంగా , స్నేహితుడుగా మనసా వాచా భావించిన ఆ బాబా ని వేడుకునేది ఒక్కటే -జన్మతః లభించిన గొప్ప వరాలైన  ఈ మౌనం , ఈ చిరునవ్వు నన్ను ఈనాటికీ విడిపోకుండా నా మరణ సమయంలో కూడా నా పెదిమల మీద చిరునవ్వు ,హృదయంలో ఆనందం నాతోనే ఉండాలని , ఎక్కడనుండి వచ్చానో ఆ ఒడిలోనికే చేరాలని కోరుకుంటున్నాను . .మహోన్నతమైన స్త్రీ జన్మ లభించినందుకు ఒకందుకు సంతోషం,ఒకందుకు దుఃఖం .. నా ఈ జన్మ  చాలు . మరుజన్మ వద్దు ..                      











     

No comments:

Post a Comment