Total Pageviews

Monday, December 19, 2011

ఏ  తోట లో విరబూసేనో ఈ పూలు ....
స్కూల్  లో అడుగు పెట్టిన దగ్గర నుండి, పని చేసినన్ని  సంవత్సరాలూ నా మనసులో ప్రతి క్షణం మెదిలిన ఈ పదాలు నాకు ఏదో తెలియని , వివరించ లేని ఆనందాన్ని, అనుభూతిని కలిగించేవి ..
నేను జాయిన్ ఐన మొదట్లో మా కాలేజి principal ఉమా మహేశ్వర రావు గారు ఒక స్పీచ్ లో .." క్లాసు రూం లో అడుగు పెట్టి , తిరిగి బయటకు వచ్చేప్పుడు మన పెదిమల మీద కదలాడే చిరునవ్వు చెబుతుంది మనం ఆ రోజు పాఠం  ఎంత బాగా చెప్పాము అన్నది " అని చెప్పారు .. విన్న వెంటనే నాకు అదో తృప్తి .. నన్ను నేను పరిశీలించు కున్నాను .. ఎస్ .. అది నాకు దొరుకుతుంది ప్రతి సారి అని ..ఆ తర్వాత కూడా నన్ను నేను పరిశీలించు కుంటూ వుండే దానిని ...ఆ క్షణాలు మిస్ కాకూడదని  ..మనం పిల్లలు అందరిని ఒకే దృష్టి తో చూస్తాము .. ఒకే యాంగిల్ లో చూస్తాము .కానీ , క్లాసు రూం లో నలబై మంది పిల్లలు వుంటే, ఎనబై కళ్ళతో మనల్ని పరీక్షిస్తారు అని మా తెలుగు మురళి కృష్ణ మాస్టారు గారు చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చి పోయేదానిని కాదు. ..ప్రతి స్టూడెంట్ కి ఏదో ఒక టాలెంట్ వుంటుంది ..అవి పైకి చెప్పాలని ,చూపించాలనే తాపత్రయం తో వుంటారు ..అది కనిపెట్టి వాళ్ళను ప్రోత్సహిస్తూ, వాళ్లకు అనుగుణంగా మమ్మల్ని మేము మలచు కుంటూనే , వాళ్ళు మా మాట వినేట్లు  చేసే వాళ్లము..మ్యూజిక్ ని ఇష్టపడని వాళ్ళు వుండరు .. అందులో పిల్లలు మరీ .. క్లాసు లో కనీసం పది నిమిషాలు వారితో పాటలు పాడిస్తూ, తప్పని సరిగా రెండు పాటలు చెప్తూ వుండే దానిని  .. "సారే జహాసే అచ్చా , హమ్ హోంగే కామ్ యాబ్      ... .చాలా చాలా ఆనందకర క్షణాలు అవి ...లంచ్ టైం లో  వాళ్ళ తో కబుర్లు చెప్తూ ,కలసి భోజనం చెయ్యడం , కూరల పేర్లు చెప్పుకుంటూ , రకరకాల విన్యాసాలు చేస్తూ ..నిజంగా అదృష్టమే .. కదా ..
పిల్లలే పూలు .. మరి వాళ్ళు పూలు తెచ్చి ఇస్తే ?   చాలా అపురూపం గా వుండేది ..తలలో పెట్టుకుంటే వాడి పోతాయని , అర చేతిలో వుంచి ..మురిసిపోయే వాళ్లము ...      rukmini devi

Thursday, December 15, 2011

నాకు దొరికిన అదృష్టం

ప్రతి మనిషి జీవితం లో, ప్రత్యేకంగా స్త్రీ జీవితంలో ఎన్నో దశలు వుంటాయి.. సహజంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇలా చెప్తుంటారు.......... "మనిషి జీవిత కాలం లో  నాలుగు దశలను ఎదుర్కోవాలి .. అవి బాల్యం, యవ్వనం, గృహస్థ జీవేతం, వాన ప్రస్థం అని. కాని స్త్రీ జీవితంలో  మరి కొన్ని  దశలను చేర్చవచ్చు ...పసితనం , విద్యార్ధి గా వున్నప్పుడు , వివాహ మైనప్పుడు , మొదటిసారి తల్లి కాబోతుందని తెలిసినప్పుడు , బిడ్డ పుట్టిన రోజు , ఆ బిడ్డ ఆలనా పాలనా ,ఆ బిడ్డ ఎదుగుతూ తన కళ్ళ ముందే  తన జీవితాన్నిప్రారంబించి నప్పుడు , వారి  పిల్లలు ,తిరిగి వారి ఆలనా పాలనా ,,ఓహ్  .......ఎన్ని అద్భుత ఘట్టాలు ?ఐతే ఇవన్నీ ముందుగా జీవితం గురించి ఒక pranaalika వున్న వారి గురించి ..
మరి నేను ?........చదువుతున్నప్పుడే పెళ్లి .....పద్దెనిమిది సంవత్సరాలు నిండినవి .. ... ఇంటికి పేరుకు పెద్దదానిని ..కాని..... అమ్మ ,అమ్మ్నలు పిల్లలతో ఏమీ charchinchaka   పోవడం తో ఏమీ తెలిసేవి కావు .వివాహం ఐంది .. క్రొత్త సంసారం ...రుచిని బట్టి (అమ్మ వంటలు ) వంట చేయడం మొదలైంది ...మొదట్లో  మొదట్లో మొదలైన నా వంటలు ఆహా, ఓహో గెలుచు కున్నాయి ..  కాని, అవి అన్నీ పురాతనమే ... కొత్తవి  నేర్చుకుందామన్న కోరిక , అభిలాష లేక పోవడం వల్ల ఇప్పుడు కొంచెం .కాదు .....చాలా ఇబ్బంది గా వుంది ...  anduke అప్పుడప్పుడు సింపుల్ గా మా వారి మీదకు నెట్టేస్తున్నాను .. మీ వల్లే , మీ వల్లే , అని .. కారణం ఒక్కటే ---నీకేం కావాలో చెప్పు. గృహప్రియలు, శివరామ కృష్ణలు  వున్నాయి అనేవారు .....అర్ధమైంది కదా ....వైవాహిక  జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి కావాల్సిన పద్ధతులు అనుసరించడం వల్ల ఎలాంటి కష్ట నష్టాలు లేవు .. ఐతే నా జీవితం లో మరువ లేని , మరపుకి రాని, ఒక ముఖ్య ఘట్టం వుంది ...అది నా ఉద్యోగ ఘట్టం ....ఎంత కష్ట పడ్డానో , అంతటి ఆనందం నాకు దక్కింది ...ఆ ఆనందాన్ని ఇప్పటికీ పొందుతుంటాను ....ఆ జ్ఞాపకాలు అలాంటివి ......
వివాహం ఐన తర్వాత మా అత్తగారు నన్ను చదువుకున్నావు కదా, ఉద్యోగం   చెయ్యాలనిపిస్తే చేసుకోమ్మా అని చెప్పారు.. ... నాకు చదువుకోవాలని వుండేది .. దానికి మా వారు ప్రోత్సహించారు ...మొట్ట మొదటి సారి బ్యాంకు లో వ్రాత పరీక్ష పాస్ అయ్యానని తెలిసి నాగపూర్ లోని అజని కాలనీ లో మన తెలుగు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసారు .. కాని ఇంటర్వ్యూ లో వాళ్ళు ఏదో చిన్న పల్లెటూరు లో పోస్టింగ్ ఇస్తారని తెలిసి వద్దు అని నిర్ణయించుకున్నాము .. కారణం ఒక్కటే -----మా బాబు నాలుగు నెలల వయసు వాడు కావడం  ...తెలియని ప్రదేశాలు అని .... తర్వాత neeku ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు కదా.. నేను చూసుకుంటాను అని మా వారు అనడం తో ఆ ఆలోచన మరి మనసులో రాలేదు ...తర్వాత పాప పుట్టింది .. ... పిల్లల్ని చూసుకుంటూ , పుస్తకాలు చదువుకుంటూ , వచ్చే పోయే వారికి మర్యాదలు  చేసుకుంటూ , అల్లికలు , డ్రాయింగులు ఇలా నచ్చిన పనులు చేసుకుంటూ , కంప్యూటర్ languages నేర్చుకుంటూ ,,, ఇలా కాలం గడుపుతున్న నాకు దొరికిన అదృష్టం .......నేను  అనుకోనిది , కల గననిది ఐన స్కూల్ టీచర్ ఉద్యోగం ...బాబు ఎలా చదువుతున్నాడు అని తెలుసుకుందామని  స్కూల్ కి వెళ్ళిన  నాకు దొరికిన అవకాశం ... ప్రిన్సిపాల్ గారు " మాడం , మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా ?" అని అడిగారు  .. లేదని చెప్పడంతో   మా స్కూల్ లో టీచర్ గా పని చేస్తారా అని అడిగారు ... ఆఫీసు సైడ్ aite   ఏదైనా చేస్తాను అని అన్నాను ...ఎందుకంటే, నాకు టెక్నికల్ సైడ్ చాలా ఇష్టం వుండేది .. ......

Saturday, June 11, 2011

గోదావరి గట్టు గురించి ఎంత చెప్పినా తరగదు. సాయంత్రం ఈ చివరినుండి ఆ చివరకి నడకలు, పిల్లలు ఆడుకోవాలన్నా, రోడ్దుమీదకు వెళ్ళి, బస్సు లేదా రిక్షా ఎక్కి మెయిన్ బజారుకి వెళ్ళడానికి బద్దకించేవారు, గోదావరి గట్టు మీద సరదా, సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళి రైల్వే గేటు ప్రాంతంలో క్రిందకి దిగి, మెయిన్
రోడ్డు ఎక్కేవారు.. సైకిళ్ళు వేసుకుని పందాలతో నడిపేవారు.. ఏం చేయడానికి పాలుపోని నాలాంటివారు సైలెంటుగా కొద్ది దూరంలో ఉన్నగోదావరిని చూస్తూ వుండిపోయేవారు.

అన్నిటికన్నా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే........... మా ఇంటికి ఎదురుగా కాక ఆ ప్రక్క ఇంట్లో ఒక కుటుంబం ఉండేది..పేర్లు వ్రాయను. కాని ఆ వీధికంతటికీ సందడిని తెచ్చే సంఘటనలతో సరదా సీన్లు కన్పిస్తుండేవి... నిజానికి ఆ ఇంటి యజమాని ఒకప్పుడు రిక్షా పుల్లర్ అట, ఎక్కడో చిన్న పూరింట్లో ఉండేవారట, మొదటి భార్య చనిపోతే ఆమె ద్వారా కలిగిన ఒక ఆడపిల్లను చూసుకోవడానికి రెండవ పెళ్ళి చేసారట.

ఆమె వచ్చిన వేళా విశేషం, రిక్షా నడపడం మానేసి ఒక సేఠ్ దగ్గర పనికి జాయిన ఐన కొన్నాళ్ళకు ఆ సేఠ్ దగ్గర వెయ్యి రూపాయిలు అప్పు తీసుకుని ఇతను వడ్డీకి అప్పులు ఇవ్వడం మొదలు పెట్టారట..
ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా డబ్బు కూడగట్టుకుని ఆ ఇల్లు కొనుక్కుని వచ్చారట..ఐతే ఎమిటి అంటారా...ఒక విధంగా చెప్పాలంటే ఆర్ధికంగా స్థిరపడ్డారు..విచిత్రం ఏమిటంటే, అతను తన బిజినెస్ టైము ఐపోయి ఇంటికి తిరిగి వస్తూ తన భార్య కోసం ఏవో ఒకటి తీసుకువచ్చేవారు..ఆ వీధి చివరినుండే అందరికీ వినిపించేలా "ఏమెవ్ సరస్వతీ, నీకు మల్లెపూలు తెచ్చానే" అనో లేదా "నీకు స్వీట్స్ తెచ్చాను" అనో అరచుకుంటూ వస్తుంటే ఇళ్ళల్లో వున్నవారు అందరూ పిల్లలతో సహా బయటకు వచ్చి ఒక వింత జంతువును చూసినట్లో లేక జోకర్ని చూసినట్లో ఒక విధంగా చెప్పాలంటే అవి ముసిముసి నవ్వుల సరదా గడియలు...మర్చిపోలేని క్షణాలు..
అతని ప్రతి మాటా, నడకా అందరికీ వినోదదాయకం..పెద్ద కూతురుని ఒక మాదిరిగా చూసేవారు(మొదటి భార్య కూతురు). ఈమెకు పుట్టిన పిల్లలను పేరు పేరునా పిలిచి ఏదో ఒకటి ఇచ్చేవారు..రెండవ అమ్మాయి కొంచెం రంగు తక్కువ. ఆ పాపను, నా నల్ల బంగారమే... అంటూ ముద్దుల వాన కురిపించేవారు ఇంటి బయటే..
నా పెళ్ళి ఐన తర్వాత నేను,మావారు కలసి ఆ వీధిలో తెలిసిన వారి ఇంటికి వెళ్ళి వస్తుంటే మా ముందు నుండి ఒక లూనా వెళ్ళింది. దాని పైన ఉన్న వ్యక్తిని చూపించి.. ఎవరో చూడండి, ఎలుక పైన ఏనుగు కూర్చున్నట్లుంది.. అన్నాను. మావారు "ఇంకేవరు, మీ మావయ్యగారు" అన్నారు. విషయం ఏమిటంటే, తను కొత్తగా బోలెడు డబ్బులు పోసి ఒక లూనా కొనుక్కున్నానన్న విషయం చుట్టుప్రక్కల అందరికీ తెలియాలని తన రెండవ కూతుర్ని, అదే తన నల్ల బంగారాన్ని ముందు కూర్చోబెట్టుకుని అన్ని వీధులూ త్రిప్పుతున్నారని...
వాళ్ళ పెద్దబాయి నా క్లాస్ మేట్.. అసలు చదివేవాడు కాదు.. నాతో పోల్చి తనకి రోజూ అక్షతలు భయంకరంగా వేస్తూ వుండేవారు.. మెరిట్ లో వుండడం నా తప్పా అనిపించేది నాకు.
ఊహ తెలిసిన తర్వాత ఆ ఇంటి ఆవిడ (అత్తయ్యగారు అని పిలిచేవాళ్ళము) సన్నజాజులు కోసి సగం నన్ను తీసుకోమని,తను సగం తీసుకునేవారు..అప్పుట్నుంచి మాల కట్టడం నేర్చుకున్నాను..
దండ కట్టి అమ్మకి ఇస్తే, నాకు కావాలి అని నా తర్వాత పుట్టిన నా చెల్లెలు రెండు జడలు వేయించుకుని పూలు తలలో పెట్టించుకుని, అందరికీ చూపడానికి వెళ్ళిపోయేది....
మా ఇద్దరి జడలూ పొడవు కావడంతో అమ్మ ఓపికగా (నాన్నగారు తాటాకుబుట్టలతో చేమంతి,లిల్లీ, మల్లెపూలు గులాబీలు తెచ్చేవారు) జడలు పూలతో కుట్టి, మమ్మల్ని తయారుచేసేది. బయటకు వెళ్ళి (మరి అందరికీ చూపించాలి కద) కొంచెం అటు వెళ్ళేవాళ్ళమో లేదో, మేకలు మా తలలోని పూలు తినడానికి లాగేసేవి.... నా అంత పెద్ద జడలనీ నాగేంద్రునికి మొక్క ఉంది అని అమ్మ గుడివాడ దగ్గర మోపిదేవి అనే ఊరికి తీసుకు వెళ్ళి మరీ కట్ చేయించింది., ).అప్పుడు నేను ఏడవ తరగతిలో వున్నాను.)... ఎంతలో ఎదుగుతాయిలే అని ఒక ఓదార్పు. ఐతే ఏ ఫీలింగ్స్ లేని నాకు అది
ఏమీ తెలియని మార్పు కావడంతో బాధ పడింది ఏమీ లేదు...చాలా త్వరగానే నా జుట్టు పెరిగి జడలు వేసుకునేదాన్ని.

నాన్నగారిది ఒక సమయం అని ఫిక్స్ డ్ లేకపోవడం వల్ల తనకి ఉదయం ట్రైన్ కి వెళ్ళాలి అన్నరోజున అమ్మ రాత్రిళ్ళు మా ఇద్దరికి జడలు అల్లి పైకి రిబ్బన్ తో కట్టేసేది. మరల మరుసటిరోజు సాయంత్రం వరకు జాగ్రత్తగా వుంచుకోవల్సిన భాద్యత మాది. ఆ రోజుల్లో ప్రతిరోజూ తలకి కొబ్బరినూనె వ్రాయనిదే జడలు వేసేవారు కాదు..ఆ సమయంలో పిల్లలు ఎలా ఉండాలి, ఏం చెయాలి లాంటి హితభోధలు ఉండేవి.. అది ఒక కేరింగ్ మరియు తర్వాత తరాల వారికి మార్గధర్శకం..ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఈ సంస్కృతి కన్పిసుంది. మరి ఈనాటి జీవనవిధానంలో ఆ పెద్ద కుటుంబాలు లేవు, ఈ మన తల్లిదండ్రులకి మనతో గడిపే ఆలోచన, సమయం లేవు..వున్న సమయాన్ని పిల్లల కోసమే కదా మేము ఇంత కష్టపడుతుంది అని తమను తాము సమర్ధించుకుంటున్నారు... కాని తప్పదు..
చదువుకున్న చదువులు, నా జీవితం, నా భవిష్యత్తు అన్న భావనలు....పెరిగిన ఖర్చులు, పిల్లల ఫీజులు, సరదాలు, ఇవన్నీ తట్టుకోవాలంటే సమయంతో పాటుగా కొట్టుకుపోవడం తప్ప మరేమి చెయ్యలేని పరిస్థితులు.
కాని ఒక్క విషయం................ ఒంట్లో ఓపిక తగ్గి, అంతగా పరుగులు పెట్టలేని స్థితిలో ఒక్కసారి కళ్ళుమూసుకుని తమ తమ గత జీవితంలోనికి తొంగి చూస్తే................. కనిపించేది అంతా "శూన్యమే". మనకే ఆశ్చర్యం కలుగుతుంది....... "ఇదా మన గతం" అని................. అందుకే కాబోలు పెద్దలు అన్నారు "ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,,ముళ్ళున్నా,రాళ్ళున్నా సాగాలి మన పయనం " అని.
, rukmini devi