Total Pageviews

Friday, November 26, 2010

నా జ్ఞాపకం లో మరో పేజీ.......

నేను స్కూల్ లో చేరిన తర్వాత నా షెడ్యూల్ ఒక సిస్టమాటిక్ గా నడిచేది..ఇంటికి, స్కూల్ కి దూరం,పర్వాలేదు..నడవగలిగేంతగానే ఉండేది. చిన్నపిల్లలం కద.. ఆ ఎనర్జీ వేరు..ఈనాటి పిల్లల్లాగా అమ్మా లేక నాన్న వచ్చి స్కూల్ లో వదిలిపెట్టడం, ఆటోలు, స్కూలు బస్ లు,లంచ్ బాక్స్ లు మోసుకుని వెళ్ళడం ఉండేది కాదు...బాగా చదువుతానని స్కూల్ లో పే.....ద్ద పేరు.. అందరూ నెత్తిమీద పెట్టుకుని చూసినట్లే ఒక విధంగా.. ఐనా ఎలాంటి అనుభూతులు, అనుభవాలకి లొంగిన దాన్ని కాదు కాబట్టి, అవి నాకు కనీసం జ్ఞాపకాలుగా కూడా దాచుకోలేదు..నా మౌనమనే pEjee లో అవి కొన్ని అక్షరాలు అంతే...స్కూల్ కి వెళ్ళేదారిలో ఎన్నో యాక్సిడెంట్లు చూసేదాన్ని(ప్రైమరీ స్కూల్ ఇంటికి మరింత దూరం కావడం వల్ల).. ఐతే రాత్రులు మాత్రం ఎవరినీ ప్రశాంతంగా నిద్రపోనిచ్చేదాన్ని కాదట.. కలలు, కలవరింతలు....నా పేజీ లో ఆ అక్షరాలతో బాటు నా చుట్టూ నాతో చదువుకున్న విద్యార్ధినీ,విద్యార్ధులు..(పురిపండా అప్పలస్వామి గారి మహాభారతం,  ఇప్పుడు నా దగ్గర ఒక పుస్తకమే ఉంది. రెండవది మా నాన్నగారు, ఆయన మిత్రుడొకాయన " జ్వరంగా ఉంది.ఏం తోచడం లేదని" అడిగితే ఇచ్చారు.   పోస్టాఫీసు వీధిలోని మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన (నేను పుట్టకముందు నాటి) బాలమిత్ర, చందమామ పుస్తకాలు ఉండేవి..)

..మెరిట్ స్టూడెంట్ అని మా టీచర్లు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల.. . నాకు స్కాలర్ షిప్ వచ్చిందని ప్రిన్సిపల్ మా నాన్నగారికి కబురు చేస్తే, ఆ డబ్బులు ఏం చేస్తావురా అని అడిగిన వారికి మా నాన్నగారికి బట్టలు కొని పెడతానని సమాధానం ఇచ్చిన గుర్తు..అమ్మ నా జీవితంలో నన్ను కన్నతల్లిగా మాత్రమే అనుభవం..ఆమెకి మేమే కన్నవాళ్ళము.నా బంధువులు అందరిపట్ల నాకు అమితమైన ప్రేమ.. మనసులోనే ఉండిపోయేది... కారణం " నా మౌనం"....నో ఫీలింగ్స్, నో ఎక్స్ ప్రెషన్స్,,నో షేరింగ్స్...ఒక చిన్న చిరునవ్వు తప్ప....మరి నీ షెడ్యూల్ ఏముంది అంటే...ఉదయం నిద్రలేవడం, నా పనులన్నీ చూసుకుని తయారైన తర్వాత మా ప్రక్క వీధిలో "గోదావరి గట్టు"కి ఇవతల ప్రక్క ఉన్న "గౌతమీ గ్రంధాలయం" కి వెళ్ళి నాకు నచ్చిన పుస్తకం తీసుకుని మౌనంగా చదువుకుని, ఇంటికి వచ్చి అమ్మ పెట్టింది తిని,బుక్స్ తీసుకుని
స్కూల్ కి వెళ్ళడం...సాయంత్రం తిరిగి వచ్చి,స్నానపానాదులు కానిచ్చి మరల గ్రంధాలయం కి వెళ్ళడం..
 నా కేరాఫ్ అడ్రస్ చాలా ఈజీ కద..ఇంటికి వచ్చి చుట్టుప్రక్కల ఎవరైనా ఆడుకుంటూ ఉంటే వారితో కొంచెం సేపు ఆటలు.... నాన్నగారు ఉన్నప్పుడు కొంత మార్పు ఉండేది...5గురు పిల్లలు ఐనా ఆయన అందరినీ తీసుకుని ఒక మంచి సినిమాకి గాని, గుడికి గాని లేక షాపింగ్ కి గాని తీసుకువెళ్ళేవారు.. ఆయన దగ్గరనుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు ఇప్పుడు గాని అనుభవంలోకి రాలేదు..ఎవరినీ ఇదే తినమని బలవంతం చేసేవారు కాదు.. తనకు నచ్చినదే కొనమని, వేసుకోమని  మొండితనం చూపించేవారు కాదు..అమ్మతో కలిపి ఆరుగురికి ఏది నచ్చితే అది ఇచ్చేవారు.. నాకు స్వీట్ అస్సలు ఇష్టం ఉండేది కాదు..అందుకని నాకోసం హాట్ ఐటెమ్స్ తెచ్చేవారు..అందరితో అర్ధరాత్రి డ్యూటీ నుండి వచ్చినా కారమ్స్ ఆడేవారు..మాకు నేర్పిస్తూ ఆడేవారు...తనే గెలిచేవారు..గెలవడం ఎలానో తెలిపేవారు..వివిధ లైబ్రరీల నుండి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు.. ఏరొజూ ఎలాంటి ఆంక్షలూ విధించేవారు కాదు..బహుశా అమ్మ మమ్మల్ని సిస్టమాటిక్ గా ఉంచడం ఆయనకి నచ్చి ఉండవచ్చు..తనకి ఇంకో అలవాటు ఉండేది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాకు తన పాంట్ జేబులో ఎంత చిల్లర ఉంటే అంత ఇచ్చి వెళ్ళడం..అలా ఇచ్చిన డబ్బులతొ మొట్టమొదటి సారి నా అంతట నేనుగా కొనుక్కున్న పుస్తకం "ఆంధ్రప్రభ" వీక్లీ...ఎంతో ఆనందం అన్పించింది..ఆ రోజును, ఆ అనుభూతిని ఇప్పటికీ మరచిపోలేను... తను ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి.రాగానే ఆ బుక్ చూపిస్తే మెచ్చుకున్నారు తప్పనీ వయసు ఎంత అని ప్రశ్నించ లేదు.. అప్పుడు నేను సిక్స్త్ క్లాసులో వున్నాను..మమ్మల్ని నిద్ర లేపే విధానం కూడా డిఫరెంట్ గా వుండేది..చిన్నగా దగ్గేవారు.. అంతే..తెల్లవారుఝాము ఐదు గంటల కల్లా అందరి పక్కబట్టలు నీట్ గా వాటి స్థానాల్లోకి వెళ్ళిపోయేవి... మరి ఇప్పటి పిల్లలు ?అందుకే నాకు అన్పిస్తుంటుంది..పిల్లల ప్రవర్తనకు భాధ్యులు పెద్దవాళ్ళము మాత్రమే అని... పంచాక్షరమ్మ అని మా ఇంటికి దగ్గరలో,బహుశా అమ్మకి పరిచయం..ఆమె అంటూ ఉండేవారు.. "రుక్మిణీ, బాగా చదువుకో...ఆడపిల్లలకీ చదువులు ఉండాలమ్మా."అని. ఎన్నోసార్లు ఈ మాటలు చెప్తూ ఉండేవారు..అప్పటికే ఆమెకి పెద్దవయస్సు...మరి ఇప్పుడు ఉన్నారో,లేరో తెలియదు..ఎందుకంటే,నేను రాజమండ్రిని నా పద్దెనిమిది ఏళ్ళ వయసు లోనే వదిలి పెట్టాల్సి వచ్చింది..........మా వారు ఆ సంవత్సరమే పెళ్ళి చెయ్యాలని పట్టుబట్టడంతో..    

rukmini devi

2 comments:

  1. బాగున్నాయి మీ జ్ఞాపకాలు. నేను కూడా మన రాజమండ్రీ వదిలి రెండు సంవత్సరాలు కావస్తోంది!

    ReplyDelete
  2. నిజమేనండి .. మన రాజమండ్రి

    ReplyDelete