Total Pageviews

Wednesday, June 22, 2016

ఇంట్లో పిల్లలని కూర్చోబెట్టి చదివించడం ,నేనూ ఏవో బుక్స్ తిరగవేయడం అలవాటు తప్ప అంతమంది పిల్లలకి భోధన అంటే చాలా బాధ్యతాయుతమైన పని ... భయపడలేదు గాని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ అయ్యే దానిని .. అప్ టు డేట్ సమాచారం పిల్లలకి అందించడానికి ప్రయత్నం చేసేదానిని ...ఇవన్నీ ఒక ఎత్తు .. అనుభవం లేదు అని చెప్పడంతో ముందుగా నాకు సెకండ్ క్లాస్ అప్పగించారు .. సైన్సు సబ్జెక్టు .. కేవలం కొన్ని వర్కింగ్ అవర్స్ .. తర్వాత తర్వాత క్లాస్ టీచర్ గా మార్చేశారు .. వేణుగోపాల రావు గారు (ప్రిన్సిపాల్ ) ముందు కూర్చున్న నాకు ఆయన చెప్పిన కొన్ని మాటలే చెవులలోనికి వెళ్లాయి .. "ఎక్కువ పని ఇవ్వను . స్టడీ అవర్స్ ఇవ్వను .. మీకు ఏ సహాయం కావాలన్నా ఇతర టీచర్లు మరియు నేను అన్ని వేళలా అందుబాటులో   ఉంటాము. ".. జీతం ఇతరత్రా ఏమీ నాకు చెవులలోనికి వెళ్ళలేదు .. జాయిన్ అయినా రెండవరోజు నాకు నూట నాలుగు దాటిపోయింది జ్వరం .. మరుసటి రోజు రాగలనో లేదో అని చెప్పగానే .. ఇదేమిటి, జాయిన్ అయినా వెంటనే లీవ్ అన్నట్లు చూసిన ప్రిన్సిపాల్ మొహం ఇప్పటికీ మర్చిపోలేదు . ఇంటికి చేరడమే మా పాప మావారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు .. ఐస్ క్యూబ్స్ తో మసాజ్ అవసరం పడింది టెంపరేచర్ తగ్గించడానికి... మరుసటి రోజు స్కూల్ కి వెళ్లి రిజిస్టర్ లో sign చేస్తున్న నాతో మా ప్రిన్సిపాల్ " నీకు రెండు వందలు ఇంక్రిమెంట్ పడింది " అన్నారు .. ఆశ్చర్యపోవడం నా వంతు .. ఇంక్రిమెంట్ అంటే ఏమిటో నాకు తెలియంది . వెంటనే మా వారికి ఫోన్ చేశా .. విషయం చెప్పగానే ఆయన పెద్దగా నవ్వి - గవర్నమెంట్ ఉద్యోగస్తులం. మేము సంవత్సరం అంతా కష్టపడితే వందరూపాయలు ఇంక్రిమెంట్ .. మొన్న జాయిన్ ఐ ,నిన్న మానేసినదానికి ఇంక్రిమెంట్ ఇవ్వడమా ? బహుశా నీ శాలరీ ఏ పన్నెండు వందలో ఐ ఉంటుంది .. ఒకసారి చెక్ చేసుకో " అని నవ్వారు .. నేను అంత ధ్యాస పెట్టలేదు .. కానీ, క్యాంపస్ లో ఏదో జరుగుతుంది. నాకు అర్ధం కావడం లేదు . కొందరు అత్యంత ఉత్సాహం గా ఉన్నారు . మరికొందరు కొంచెం నిరుత్సాహం తో మరికొందరు ఫైరింగ్ మోడ్ లో .. తమలో తామే రగిలిపోతూ , ఉత్సాహంగా ఉన్నవాళ్ళ ని కామెంట్ చేస్తూ .. ఎవరినో తిట్టుకుంటూ ... ఈరోజుకి  ఒక విషయం తో కంక్లూడ్ చేస్తాను - విద్యాలయం అన్నది ఒక సుందరమైన ,అత్యద్భుతమైన ప్రపంచం .. మరో కోణంలో చూడడం జరగలేదు . . కానీ , మొదట్లో అందరూ ఒకటిగానే చూసిన నాకు చివరలో కొన్ని విభిన్న మనస్తత్వాలు కనబడ్డాయి .. ఒకే దగ్గర అన్ని యాంగిల్స్ కనబడడం అన్నది మనకి అలాంటి ఆర్గనైజషన్స్ లో తప్పనిసరి అనిపించింది.. మరిన్ని మధురమైన విషయాలతో మరల .... 

     







               

No comments:

Post a Comment