Total Pageviews

Tuesday, June 28, 2016


విజ్ఞాన్ రత్తయ్య గారు అనే మాట ఏనాడో న్యూస్ పేపర్ లో చదివాను .. ఎవరికో ఏదో జరిగింది . ఏం జరిగిందో  విషయం గుర్తు లేదు గాని, ఒక వాక్యం గుర్తుండిపోయింది - ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లినవిజ్ఞాన్ విద్యాలయాల అధినేత లావు రత్తయ్య గారు అని వ్రాసారు పేపర్ లో .. కనీసం ఫోటో కూడా చూడలేదు . అంతకన్నా ఎక్కువగా చదవలేదు . . వారి ఒక సంస్థలో చేరుతానని గాని, నా సర్వీసెస్ అక్కడ ఉంటాయి అని గాని ఏ మాత్రం ఊహించనిది .. ప్రతి సంవత్సరం రత్తయ్య గారి జన్మదినం నాడు స్టాఫ్ మెంబెర్స్ కి ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరుగుతుందట .. ఆనాడూ నేను జాయిన్ అయినా మూడవరోజునే ఇంక్రిమెంట్స్ ఇవ్వడం , క్రొత్తగా చేరినవారికి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వడం అన్నది ఆయన మాత్రమే చేయగలరు . . తిమ్మాపురం విజ్ఞాన్ పెద్ద భవనాలతో కూడి ఆకర్షణీయంగా ఉంటుంది .. ఆ క్యాంపస్ నాకు కొత్త కాదు . బాబు చదువుతున్నప్పుడు తరచుగా అక్కడికి వెళ్లడం ,వెళ్ళినప్పుడు స్టాఫ్ మెంబెర్స్ మాకు భోజనానికి ఆహ్వానించడం - అక్కడి వైభవం వర్ణించ లేనిది .. రుచికరమైన ,ఆరోగ్యకరమైన ప్రతిరోజూ ఒక పెళ్లి విందు లాంటి భోజనం .. ఒక విద్యాసంస్థ ఇటువంటి భోజనం, ఇటువంటి క్యాంపస్ (ఒక యూనివర్సిటీ ని తలపింపజేస్తుంది) , అక్కడి ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు పేరెంట్స్ ని డీల్ చేసే తీరు , విద్యార్థులను ట్రీట్ చేసే తీరు నిజంగా అభినందనీయం .. అందుకే మా వారితో సహా మా కుటుంబ సభ్యులం అందరమూ ఫిదా అయిపోయాము .. ఏదైనా  సాంస్కృతిక ప్రోగ్రామ్స్ conduct చేయాలంటే ఆ అందం వేరు .. మానేజర్ శ్రీనివాసరావు గారి ఆద్వర్యం లో (వినయశీలి ) ఒక పద్దతిలో జరిగిపోతూ ఉండేవి  .
మా రత్తయ్య గారు క్యాంపస్ లో అడుగుపెట్టినప్పుడు అందరూ అమ్మో డైరెక్టర్ గారు వచ్చారట అని అనుకునేవారు .. ఎప్పుడైనా క్యాంపస్ లో క్లాస్ కి వెళ్లి వస్తున్నప్పుడు సడెన్ గా ఎదురైనా ఆయనలో ఏ మాత్రం భేషజం కనబడేది కాదు . సైలెంట్  గా ప్రక్కకు తప్పుకుని వెళ్లిపోయేదానిని. .
ఆ మధ్య కాలంలో ఓపెన్ హెర్ట్ విత్ ఆర్ కె అన్న ప్రోగ్రామ్ లో రత్తయ్య గారి ఇంటర్వ్యూ విన్నాను . చివరగా ఆయన వ్యక్తం చేసిన కొన్ని విషయాలు నిజమే కదా . ఇటువంటి ఎడ్యుకేషనిస్ట్ ని రాజకీయ నాయకులు ఎందుకు ఒక విద్యా మంత్రిగా తీసుకోవడం లేదు అని అనిపించింది .
కారణం- స్కూల్ లో అటెండ్ అయినా మీటింగ్స్ సారాంశం , దృష్టి అంతా కేవలం విద్యార్థులు . వారిని ఎం చేస్తే ,ఎలా ఏ విధంగా చదివిస్తే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి ? ఫ్రెషర్స్ ని టీచింగ్ లో తీసుకోవడం అనే ప్రయోగం ఎంత ఎనర్జిటిక్ గా పని చేస్తుంది, అందువల్ల వచ్చే రిజల్ట్ ఎంత excellent గా ఉంటుంది అన్నది ప్రయోగాత్మకంగా చూపించిన వ్యక్తి ఆయన .. అంటే భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని తెలుసుకోగలిగే ,చెప్పగలిగే సామర్ధ్యం ఆయనలో ఉంది .. పని చేయలేని అంటే ఆయన కోరుకున్న రీతిలో పని చేయలేని వారు నిరభ్యంతరంగా ఇన్స్టిట్యూషన్ వదిలి వెళ్ళవచ్చు అని చెప్పగలిగిన వ్యక్తి ఆయన ... మరి మన government ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది ఇటువంటి వ్యక్తులని అని భాద కలుగుతుంది .. హి ఈజ్ ఎ లెర్నర్ ,హి ఈజ్ ఏ టీచర్ , హి ఈజ్ ఆ మెంటోర్ .. హి ఈజ్ ఆ ఫాదర్ (సంతృప్తి కరంగా భోజనం తిన్న విద్యార్థి ఎదుగుదల ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక వ్యక్తి ) అని గట్టిగా చెప్పగలను .. ఇవి  పది సంవత్సరాల విజ్ఞాన్ విద్యాలయంలో పనిచేసి నా అనుభవం తో చూసి చెప్పిన మాటలు.. ఏ మాత్రం అసత్యాలు లేవు ఇందులో . . స్టాఫ్ ఎవరూ నెగటివ్ గా మాట్లాడడం నేను చూడలేదు . అభిమానించేవారు తప్ప .. ఎవరూ ఆయనని తిట్టుకోవడం చూడలేదు .. అటువంటి వ్యక్తి ని ప్రజల కోసం తప్పకుండా ఒక పదవిలో (విద్యకి సంబందించి ) ఉంచాల్సిందే అని నా అభిప్రాయం                ,  

    

         












      

No comments:

Post a Comment